బెంగళూరు: ఐపీఎల్ కొత్త సీజన్ ముంగిట సన్ రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్. టీమ్ రెగ్యులర్ కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమిన్స్ జట్టులో చేరాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో తను ఉత్సాహంగా పాల్గొన్నాడు. అయితే, ఫిట్‌నెస్ సమస్యల నేపథ్యంలో ఈ నెల 28న ఆర్సీబీతో జరిగే తొలి మ్యాచ్‌కు కమిన్స్ బరిలోకి దిగుతాడా..? లేదా..? అన్నదానిపై స్పష్టత లేదు.
సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఇప్పటికే ఇషాన్ కిషన్‌ను స్టాండిన్ కెప్టెన్‌గా, అభిషేక్ శర్మను వైస్ కెప్టెన్‌గా ప్రకటించింది. కాగా, గాయంతో ఈ సీజన్‌కు దూరమైన కేకేఆర్ పేసర్ హర్షిత్ రాణా ప్లేస్‌లో ఆ ఫ్రాంచైజీ నవదీప్ సైనీని తీసుకోగా.. గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ యెర్రా పృథ్వీరాజ్ స్థానంలో కుల్వంత్ ఖెజ్రోలియా ఆ టీమ్‌లో చేరాడు.
