అక్కా.. నువ్వు స్టేడియంకు రాకే.. వర్షిణిపై సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్ ఫైర్

అక్కా.. నువ్వు స్టేడియంకు రాకే.. వర్షిణిపై సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్ ఫైర్

ప్రముఖ టీవీ యాంకర్‌ వర్షిణిపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులు ఓ రేంజ్‌లోఫైర్ అవుతున్నారు. ప్రెసెంట్ ఐపీఎల్‌ సీజన్‌లో వర్షిణి 3 సార్లు స్టేడియంకు వచ్చింది. ఆమె వచ్చిన ప్రతీసారి హైదరాబాద్ జట్టు ఓడిపోతోంది. దీంతో.. ఫ్యాన్స్‌ ఆమెపై కోపంతో ఊగిపోతున్నారు. సెంటిమెంట్స్ ఫాలో ​అయ్యే సన్ రైజర్స్  ఫ్యాన్స్.. వర్షిణి మరోసారి స్టేడియంలో కనిపిస్తే అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారు.

మరికొందరైతే.. సన్‌రైజర్స్‌కు ఇప్పుడున్న దరిద్రం చాలు.. ఇక నువ్వు కూడా తొడయ్యాయవంటే.. ఆ జట్టు కోలుకోవడం కష్టమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే వర్షిణి అక్కా.. దయ చేసి నువ్వు స్టేడియంకు రాకే.. ఇంకా సన్‌రైజర్స్‌కు ప్లే ఆఫ్స్‌ అవకాశాలున్నాయి. నువ్వు వచ్చాయవంటే అవి కూడా పోవడం ఖాయంమనీ వేడుకుంటున్నారు. మే 7 రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ మ్యాచ్‌ ఉన్న నేపథ్యంలో సన్ రైజర్స్ ఫ్యాన్స్ వర్షిణిపై ఈ ట్రోలింగ్ జరుగుతోంది. వర్షిణిని మళ్ళీ స్టేడియంకు వస్తే ఈ మ్యాచ్ కూడా ఓడిపోతుంది కాబట్టి.. రావొద్దని ఫ్యాన్స్ ప్రాధేయపడుతున్నారు.

కాగా.. ఈ సీజన్‌లో హైదరాబాద్‌లో  సన్ రైజర్స్ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌లకు వర్షిణి స్టేడియానికి వెళ్లింది. ఏప్రిల్‌ 18న ముంబై ఇండియన్స్‌, ఏప్రిల్‌ 24న ఢిల్లీ క్యాపిటల్స్‌, మే 4న కేకేఆర్‌ మ్యాచ్. ఈ 3 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌ ఓడిపోయింది. మరి నిజంగా వర్షిణి సెంటిమెంట్ సన్ రైజర్స్ టీంను వెంటాడుతోందా? ఈ కామెంట్స్ అండ్ ట్రోలింగ్ పై వర్షిణి ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.