బెయిర్‌ షో..పంజాబ్ పై హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ

బెయిర్‌ షో..పంజాబ్ పై హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ

భారీ ఆశలు పెట్టుకున్న బెయిర్‌‌స్టో (55 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 97) అంచనాలను అందుకోవడం.. కెప్టెన్‌‌ డేవిడ్‌‌ వార్నర్‌‌ (40 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 52) సమయోచితంగా చెలరేగడం.. రషీద్‌‌ ఖాన్‌‌ (3/12) టర్నింగ్‌‌ మ్యాజిక్‌‌ చూపడంతో  కింగ్స్‌‌ ఎలెవన్‌‌ పంజాబ్‌‌పై గ్రాండ్‌‌ విక్టరీ కొట్టింది..! మరోవైపు భారీ టార్గెట్‌‌ ఛేజ్‌‌లో నికోలస్‌‌ పూరన్‌‌ (37 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 77) ఒంటరిగా పోరాడినా.. ఆఖరి వరకు నిలబడలేకపోయాడు..! దీంతో ఐదో ఓటమితో రాహుల్‌‌సేన మరింత కిందకు దిగజారింది..!!

దుబాయ్‌‌: ఐపీఎల్‌‌–13లో హైదరాబాద్‌‌ చెలరేగిపోయింది. ఆల్‌‌రౌండ్‌‌ షోతో అదరగొడుతూ.. మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. దీంతో గురువారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో సన్‌‌రైజర్స్‌‌ 69 రన్స్‌‌ భారీ తేడాతో పంజాబ్‌‌ను చిత్తు చేసింది. టాస్‌‌ గెలిచి బ్యాటింగ్‌‌కు దిగిన హైదరాబాద్‌‌ 20 ఓవర్లలో  6 వికెట్లకు 201 రన్స్‌‌ చేసింది. బెయిర్‌‌స్టో, వార్నర్‌‌కు తోడుగా విలియమ్సన్‌‌ (20 నాటౌట్‌‌) ఫర్వాలేదనిపించాడు. తర్వాత పంజాబ్‌‌ 16.5 ఓవర్లలో 132 రన్స్‌‌కే కుప్పకూలింది. పూరన్‌‌ ఈ సీజన్‌‌లో ఫాస్టెస్ట్‌‌ ఫిఫ్టీ (17 బాల్స్‌‌) చేసినా.. టీమ్‌‌ను గట్టెక్కించలేకపోయాడు. బెయిర్​స్టో​కు ‘మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.

కీలక భాగస్వామ్యం…

గత వైఫల్యాలను దృష్టిలో పెట్టుకుని ఈ మ్యాచ్‌‌లో ఓపెనర్లు వార్నర్‌‌, బెయిర్‌‌స్టో  చాలా పకడ్బందిగా ఇన్నింగ్స్‌‌ను ఆరంభించారు. ఫస్ట్‌‌ ఓవర్‌‌లోనే రెండు ఫోర్లతో  వార్నర్‌‌ టచ్‌‌లోకి రాగా, అనూహ్యంగా రెండో ఓవర్‌‌లో స్పిన్నర్‌‌ ముజీబుర్‌‌ బౌలింగ్‌‌కు దిగాడు. దీంతో బెయిర్‌‌స్టో ఓ ఫోర్‌‌తో సరిపెట్టుకున్నాడు. మూడో ఓవర్‌‌లో షమీ (1/40)ని తీసుకొచ్చిన రాహుల్‌‌.. కాట్రెల్‌‌తో పేస్‌‌ బౌలింగ్‌‌ను కంటిన్యూ చేశాడు. ఈ ఓవర్‌‌లో ఒక్క బౌండ్రీ వచ్చినా.. తర్వాతి ఓవర్‌‌లో బెయిర్‌‌స్టో మూడు ఫోర్లు కొట్టాడు.  అయితే ఐదో ఓవర్‌‌లో బెయిర్‌‌స్టో ఇచ్చిన టఫ్‌‌ క్యాచ్‌‌ను మిడాఫ్‌‌లో రాహుల్‌‌ మిస్‌‌ చేయగా, వెంటనే వార్నర్‌‌ మరో బౌండ్రీతో దూకుడు చూపెట్టాడు. మొత్తానికి పవర్‌‌ప్లేలో హైదరాబాద్‌‌ స్కోరు 58 రన్స్‌‌చేసింది. ఫీల్డింగ్‌‌ సడలించిన తర్వాత రెండు ఓవర్లు మెల్లగా ఆడిన బెయిర్‌‌స్టో 8వ ఓవర్‌‌లో రెచ్చిపోయాడు. రవి (3/29) వేసిన ఈ ఓవర్‌‌లో 6, 4, 6తో 18 రన్స్‌‌ రాబట్టాడు. వార్నర్‌‌ కూడా సిక్స్‌‌ బాదడంతో 9వ ఓవర్‌‌లో 11 రన్స్‌‌ వచ్చాయి. బెయిర్‌‌స్టో 28 బాల్స్‌‌లో ఫిఫ్టీ కంప్లీట్‌‌ చేయడంతో ఫస్ట్‌‌ టెన్‌‌లో హైదరాబాద్‌‌ 100 రన్స్‌‌ చేసింది.  మిడిల్‌‌ ఓవర్స్‌‌ను మెయింటేన్‌‌ చేసేందుకు ఎక్కువగా స్పిన్నర్లపై ఆధారపడటం కూడా పంజాబ్‌‌ను దెబ్బతీసింది. 11వ ఓవర్‌‌లో బెయిర్‌‌స్టో 4, 6, 6తో  మ్యాక్స్‌‌ను బాదేశాడు. తర్వాతి రెండు ఓవర్లలో 10, 8 రన్స్‌‌ రాగా, 14వ ఓవర్‌‌ (ముజీబర్‌‌)లో బెయిర్‌‌స్టో రెండు వరుస సిక్సర్లు కొట్టగా, వార్నర్‌‌ 37 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ సాధించాడు. సెకండ్‌‌ స్పెల్‌‌కు వచ్చిన కాట్రెల్‌‌ ఆరు రన్స్‌‌తో కాస్త కట్టడి చేయడంతో 15 ఓవర్లలో హైదరాబాద్‌‌ 160 రన్స్‌‌తో పటిష్ట స్థితికి చేరుకుంది.

రవి టర్నింగ్‌‌..

వికెట్‌‌ పడకుండా ఇన్నింగ్స్‌‌ ముగిస్తారనుకున్న హైదరాబాద్‌‌కు 16వ ఓవర్‌‌లో డబుల్‌‌ షాక్‌‌ తగిలింది. రవి వేసిన ఫస్ట్‌‌ బాల్‌‌కు వార్నర్‌‌.. నాలుగో బాల్‌‌కు బెయిర్‌‌స్టో  ఔటయ్యారు. దీంతో 160 వద్దే రెండు వికెట్లు పడటంతో పాటు బెయిర్‌‌స్టో సెంచరీ మిస్‌‌ అయ్యింది. ఇక ఫించ్‌‌ హిట్టర్‌‌గా వచ్చిన సమద్‌‌ (8), మనీశ్​ పాండే (1) కూడా విఫలమయ్యారు. 17వ ఓవర్‌‌ ఫస్ట్‌‌ బాల్‌‌కు మనీశ్​ రిటర్న్‌‌ క్యాచ్‌‌ ఇచ్చి వెనుదిరిగాడు. స్కోరు 161/3గా మారింది. తర్వాతి ఓవర్‌‌లో సమద్‌‌ భారీ షాట్‌‌కు ప్రయత్నించి వికెట్‌‌ ఇచ్చుకున్నాడు. ఫలితంగా స్కోరు 173/4 అయ్యింది. ఈ మధ్యలో విలియమ్సన్‌‌ (20 నాటౌట్‌‌) నిలబడ్డా.. 19వ ఓవర్‌‌ తొలి బంతికి ప్రియమ్‌‌ గార్గ్‌‌ (0) పూరన్‌‌ చేతికి చిక్కడంతో  స్కోరు 175/5గా మారింది. ఈ టైమ్‌‌లో వచ్చిన అభిషేక్‌‌ శర్మ (12) ఓ సిక్స్‌‌, ఫోర్‌‌తో 12 రన్స్‌‌ రాబట్టాడు. లాస్ట్‌‌ ఓవర్‌‌ (షమీ)లో విలియమ్సన్‌‌.. వరుసగా 4, 6 కొట్టగా, అభిషేక్‌‌ ఔటయ్యాడు. ఈ ఓవర్‌‌లో 14 రన్స్‌‌ రావడంతో హైదరాబాద్‌‌ స్కోరు 200లు దాటింది. జస్ట్‌‌ 41 రన్స్‌‌కు ఆరు వికెట్లు తీసి పంజాబ్‌‌ కాసేపు వణికించింది.

పూరన్‌‌.. కేక

భారీ టార్గెట్‌‌ ఛేజ్‌‌లో పంజాబ్‌‌కు మెరుగైన ఆరంభం దక్కకపోయినా.. నికోలస్‌‌ పూరన్‌‌  ఒంటిచేత్తో మ్యాచ్‌‌ను తీసుకొచ్చాడు.  ఓపెనర్‌‌ రాహుల్‌‌ (11) కాసేపు నిలబడినా.. రెండో ఎండ్‌‌లో సెకండ్‌‌ ఓవర్‌‌లోనే మయాంక్‌‌ (9) వెనక్కి వచ్చాడు. 11 రన్స్‌‌కే ఫస్ట్‌‌ వికెట్‌‌ పడటంతో హిట్టర్‌‌గా సిమ్రాన్‌‌ సింగ్‌‌ (11) వచ్చాడు. అయినా ఈ స్ట్రాటజీ ఫలించలేదు. నాలుగో ఓవర్‌‌లో కవర్స్‌‌లో గార్గ్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చి వెనుదిరిగాడు. రాహుల్‌‌తో జతకలిసిన పూరన్‌‌.. హైదరాబాద్‌‌ బౌలింగ్‌‌ను ఉతికి ఆరేశాడు. పవర్‌‌ప్లేలో 45/2తో ఉన్న స్కోరును పది ఓవర్లు ముగిసేసరికి 96కు చేర్చాడు. ఏడో ఓవర్‌‌లో పూరన్‌‌ వరుసగా 6, 6తో రెచ్చిపోతే.. రాహుల్‌‌ అనవసరంగా ఔటయ్యాడు. ఈ ఓవర్‌‌లో 16 రన్స్‌‌ వచ్చాయి. తర్వాతి ఓవర్‌‌లో రషీద్‌‌ రెండే రన్స్‌‌ ఇచ్చినా.. 9వ ఓవర్‌‌లో పూరన్‌‌ విశ్వరూపం చూపెట్టాడు. సమద్‌‌ వేసిన ఈ ఓవర్‌‌లో వరుసగా 6, 4, 6, 6, 6తో 28 రన్స్‌‌ దంచాడు. 10వ ఓవర్‌‌లో రషీద్‌‌ 5 రన్స్‌‌తో కట్టడి చేశాడు. అయితే అప్పటివరకు పూరన్‌‌ షో చూసిన మ్యాక్స్‌‌వెల్‌‌ (7)… గార్గ్‌‌ కొట్టిన డైరెక్ట్‌‌ త్రోకు రనౌట్‌‌కావడంతో పంజాబ్‌‌ స్కోరు105/4గా మారింది. నాలుగో వికెట్‌‌కు 47 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. ఇక భారీ ఆశలు పెట్టుకున్న మన్‌‌దీప్‌‌ (6)తో పాటు ముజీబర్‌‌ (1) వరుస ఓవర్లలో ఔట్‌‌కావడంతో 14 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌‌ 126/6తో  కష్టాల్లో పడింది. అయితే 15వ ఓవర్‌‌లో రషీద్‌‌.. ఎస్‌‌ఆర్‌‌హెచ్‌‌కు అతిపెద్ద బ్రేక్‌‌ ఇచ్చాడు. సూపర్‌‌ షాట్లతో చెలరేగిన పూరన్‌‌..  ఐదో బాల్‌‌కు భారీ షాట్‌‌కు ప్రయత్నించి బ్యాక్‌‌వర్డ్‌‌లో నటరాజ్‌‌ చేతికి చిక్కాడు. తర్వాతి బాల్‌‌కు షమీ (0) ఎల్బీ అయ్యాడు. దీంతో స్కోరు 126/8గా మారింది. ఇక గెలవాలంటే 30 బాల్స్‌‌లో 76 రన్స్‌‌ కావాల్సిన దశలో ఐదు బాల్స్‌‌ తేడాలో కాట్రెల్‌‌ (0), అర్షదీప్‌‌ సింగ్‌‌ (0) ఔట్‌‌కావడంతో పంజాబ్‌‌కు ఓటమి తప్పలేదు.

హైదరాబాద్‌‌: వార్నర్‌‌ (సి) మ్యాక్స్‌‌వెల్‌‌ (బి) రవి 52, బెయిర్‌‌స్టో (ఎల్బీ) రవి 97, సమద్‌‌ (సి) అర్షదీప్‌‌ సింగ్‌‌ (బి) రవి 8, మనీశ్​(సి అండ్‌‌ బి) అర్షదీప్‌‌ సింగ్‌‌ 1, విలియమ్సన్‌‌ (నాటౌట్‌‌) 20, గార్గ్‌‌ (సి) పూరన్‌‌ (బి) అర్షదీప్‌‌ సింగ్‌‌ 0, అభిషేక్‌‌ శర్మ (సి) మ్యాక్స్‌‌వెల్‌‌ (బి) షమీ 12, రషీద్‌‌ (నాటౌట్‌‌) 2, ఎక్స్‌‌ట్రాలు: 11, మొత్తం: 20 ఓవర్లలో 201/6.వికెట్లపతనం: 1–160, 2–160, 3–161, 4–173, 5–175, 6–199.

బౌలింగ్‌‌: కాట్రెల్‌‌ 3–0–33–0, ముజీబర్‌‌ 4–0–39–0, షమీ 4–0–33–2,మ్యాక్స్‌‌వెల్‌‌ 2–0–26–0, రవి 3–0–29–3,అర్షదీప్‌‌ సింగ్‌‌ 4–0–33–2.

పంజాబ్‌‌: రాహుల్‌‌ (సి) విలియమ్సన్‌‌ (బి) అభిషేక్‌‌ 11, మయాంక్‌‌ (రనౌట్‌‌) 9, సిమ్రాన్‌‌ సింగ్‌‌ (సి) గార్గ్‌‌ (బి) ఖలీల్‌‌ 11, పూరన్‌‌ (సి) నటరాజన్‌‌ (బి) రషీద్‌‌ ఖాన్‌‌ 77, మ్యాక్స్‌‌వెల్‌‌ (రనౌట్‌‌) 7, మన్‌‌దీప్‌‌ (బి) రషీద్‌‌ ఖాన్‌‌ 6, ముజీబర్‌‌ (సి) బెయిర్‌‌స్టో (బి) ఖలీల్‌‌ 1, రవి (నాటౌట్‌‌) 6, షమీ (ఎల్బీ) రషీద్‌‌ 0, కాట్రెల్‌‌ (బి) నటరాజన్‌‌ 0, అర్షదీప్‌‌ సింగ్‌‌ (బి) నటరాజన్‌‌ 0, ఎక్స్‌‌ట్రాలు: 4, మొత్తం: 16.5 ఓవర్లలో 132 ఆలౌట్‌‌. వికెట్లపతనం: 1–11, 2–31, 3–58, 4–105, 5–115, 6–126, 7–126, 8–126, 9–132, 10–132.

బౌలింగ్‌‌: సందీప్‌‌ 4–0–27–0, ఖలీల్‌‌ 3–0–24–2, నటరాజన్‌‌ 3.5–0–24–2, అభిషేక్‌‌ 1–0–15–0, రషీద్‌‌ ఖాన్‌‌ 4–1–12–3, అబ్దుల్‌‌ సమద్‌‌ 1–0–28–0.