పెళ్లిలో కవితను చూసి అలా వెళ్లిపోయావ్ ఏంటి బ్రో : జగదీశ్వర్ రెడ్డి వీడియో వైరల్

పెళ్లిలో కవితను చూసి అలా వెళ్లిపోయావ్ ఏంటి బ్రో : జగదీశ్వర్ రెడ్డి వీడియో వైరల్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ నాశనం కావటానికి లిల్లీపుట్ లీడర్ అంటూ జగదీశ్వర్ రెడ్డిపై కవిత సంచలన కామెంట్స్ చేయటం.. వీటికి కౌంటర్ గా జగదీశ్వర్ రెడ్డి రెస్పాన్స్ కావటం.. కవిత జస్ట్ ఎమ్మెల్సీ మాత్రమే.. పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ మాట్లాడటం తెలిసింది. ఇలాంటి టైంలో.. అనుకోకుండా ఇద్దరూ ఒకే పెళ్లికి హాజరయ్యారు.. ఇద్దరూ పలకరించుకున్నారా.. ముఖం ముఖం చూసుకున్నారా లేదా అనేది తెలుసుకుందామా..

బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ కార్పొరేషన్ చైర్మన్ సోమ భరత్ కుమార్ రెడ్డి పెళ్లి హైదరాబాద్ లో జరిగింది. ఈ పెళ్లికి కవిత హాజరయ్యారు. పెళ్లిలో అందరితో కలిసి సరదాగా ఫొటోలు దిగారు. నలుగురితో నవ్వుతూ కనిపించారు కవిత. 

సరిగ్గా ఇదే సమయంలో పెళ్లి మండపంలోకి ఎంట్రీ అయ్యారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. వేదిక దగ్గరకు వెళుతున్న సమయంలో ఎదురుగా కవిత కనిపించారు.. అంతే.. అత్యంత వేగంగా పక్కకు వెళ్లిపోయారు. కవిత కంట్లో పడకుండా జనంలో కలిసిపోతూ.. కవితకు కనిపించకుండా అక్కడి నుంచి జారుకున్నారు. కవితను ఎదురుగా చూసిన జగదీశ్వర్ రెడ్డి.. చాలా వేగంగా స్పందించి.. వేగంగా నడుస్తూ పక్కకు వెళ్లిపోవటం వీడియోలో స్పష్టంగా కనిపించింది. 

ఎదురుపడితే పలకరించాలా వద్దా.. నవ్వాలా లేదా అన్న సందేహమో ఏమో.. కవిత ఎలా స్పందిస్తారో ఏమో అనుకన్నట్లు ఉన్నారు.. ఇవన్నీ కాకుండా అసలు కంట పడకుండా ఉంటే ఏ గోల ఉండదు కదా అనుకున్నారో ఏమో.. అలా జారుకున్నారు.. కవిత కంట్లో పడకపోయినా.. కవిత నుంచి తప్పించుకున్న వ్యవహారం మాత్రం కెమెరాలో అయితే పడింది.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది..