వడ్డీలేని రుణాలు ఆపేసిందే బీఆర్ఎస్ : మంత్రి వివేక్ వెంకటస్వామి

వడ్డీలేని రుణాలు ఆపేసిందే బీఆర్ఎస్ : మంత్రి వివేక్ వెంకటస్వామి
  • కోవిడ్ సమయంలో ఎవరికీ నిధులు ఇవ్వలె
  • ప్రజా ప్రభుత్వం వచ్చాక ఇసుక, బియ్యం, భూ మాఫియా బంద్ చేసినం
  • చెన్నూరులో ఏటీసీ నిర్మాణానికి భూమిపూజ
  • మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల కింద రూ.9 కోట్ల చెక్కు అందజేత

కోల్ బెల్ట్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను ఆపేసిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకట స్వామి విమర్శించారు. కోవిడ్ సమయంలోనూ ఎవరికీ నిధులు ఇవ్వలేదన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన సోమవారం (జనవరి 19) చెన్నూరు నియోజకవర్గంలో పర్య టించారు. రూ.47.11 కోట్లతో చేపట్టనున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) నిర్మాణా నికి భూమిపూజ చేశారు. మహిళా సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల కింద రూ.9 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ట్రైనింగ్ ఇచ్చే సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇక్కడి పిల్లలు మంచిగా చదువుకొని ఈ సెంటర్లో శిక్షణ పొంది మంచి స్థాయిలో ఉండాలన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా రోడ్లు, సైడ్ డ్రైన్ లు బాగా లేకుండేవని, తాను ఎమ్మెల్యేగా గెలిచాక మార్నింగ్ వాక్ లో ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నట్లు వివరించారు. ఇసుక మాఫియా, బియ్యం మాఫియా, భూ మాఫియాను బంద్ చేయించినట్లు చెప్పారు. 

గత ఎమ్మెల్యే నిధులు కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయని, బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రా న్ని అప్పుల కుప్పగా చేశారని ఆరోపించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో రూ.40 కోట్లతో పనులు చేస్తున్నామన్నారు. చెన్నూరులో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మహిళల కోసం చెన్నూరు నియోజకవర్గానికి ఒక పెట్రోల్ బంక్ కూడా మంజూరు చేయడం జరిగిందన్నారు.

కాంగ్రెస్ పార్టీని గెలిపించండి:

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేండ్లలోనే చాలా అభివృద్ధి పనులు చేపట్టామని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మరో మూడేండ్లలో మరింత అభివృద్ధి సాధిస్తామని చెప్పారు. మాజీ సీఎం కేసీఆరూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.