RR vs SRH: చెపాక్‌లో ఘోరమైన రికార్డ్.. క్వాలిఫయర్ 2లో సన్ రైజర్స్‌కు అగ్ని పరీక్ష

RR vs SRH: చెపాక్‌లో ఘోరమైన రికార్డ్.. క్వాలిఫయర్ 2లో సన్ రైజర్స్‌కు అగ్ని పరీక్ష

ఐపీఎల్ లో నేడు బ్లాక్ బస్టర్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. క్వాలిఫయర్ 2 లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ ఢీ కొనబోతుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఆదివారం కోల్ కతా నైట్ రైడర్స్ తో ఐపీఎల్ ఫైనల్ ఆడుతుంది. క్వాలిఫయర్ 1 లో సన్ రైజర్స్ కేకేఆర్ చేతిలో ఓడిపోగా.. ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. ఇరు జట్లు ఫైనల్ కు వెళ్లాలనే పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక రికార్డ్ రెండు జట్లను బయపెడుతుంది. 

చెన్నైలోని చెపాక్ మైదానంలో రాజస్థాన్, సన్ రైజర్స్ జట్లకు ఘోరమైన రికార్డ్ ఉంది. ఇక్కడ సన్ రైజర్స్ 10 మ్యాచ్ లాడితే ఒక మ్యాచ్ లోనే గెలిచింది. మరోవైపు రాజస్థాన్ 9 మ్యాచ్ ల్లో 2 విజయాలు సాధించింది. ఇరు జట్లకు చెపాక్ పీడకలగా మారింది. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారో ఆసక్తికరంగా మారింది. స్లో పిచ్ కావడంతో ఈ మ్యాచ్ లో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. సన్ రైజర్స్ తో పోలిస్తే రాజస్థాన్ కు మెరుగైన స్పిన్ అటాక్ ఉంది. దీంతో ఈ మ్యాచ్ లో రాజస్థాన్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. చెపాక్ లో ఇరు జట్లు తలపడడం ఇదే తొలిసారి. 

లీగ్ మ్యాచ్ ల్లో చెన్నై సూపర్ కింగ్స్ తో రెండు జట్లు ఓడిపోయాయి. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు అగ్ని పరీక్షగా మారింది. ముఖా ముఖి పోరులో సన్ రైజర్స్ 10 మ్యాచ్ లు గెలిస్తే.. రాజస్థాన్ 9 మ్యాచ్ ల్లో నెగ్గింది. సన్ రైజర్స్ క్వాలిఫయర్ 1లో ఓడిపోయి ఒత్తిడిలో ఉంటే.. రాజస్థాన్ ఎలిమినేటర్ గెలుపుతో ఫుల్ జోష్ లో ఉంది. రెండు జట్లు కూడా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగొచ్చు. మరి పరిస్థితులకు తగ్గట్లుగా ఆడి ఒత్తిడిని ఏ జట్టు జయిస్తుందో చూడాలి. రెండు జట్లు కూడా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగొచ్చు.