
ఐపీఎల్ 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాయి. ఆదివారం (మే 25) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ అర్హత సాధింలేకపోయిన ఈ రెండు జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్ ను విజయంతో ముగించాలని భావిస్తున్నాయి. ఈ సీజన్ లో కేకేఆర్ 13 మ్యాచ్ ల్లో 12 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. మరోవైపు సన్ రైజర్స్ 13 మ్యాచ్ ల్లో 11 పాయింట్లతో 8 వ స్థానంలో ఉంది. ప్లేయింగ్ 11 లో సన్ రైజర్స్, కోల్‌కతా ఎలాంటి మార్పులు చేయలేదు.
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI):
క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), మనీష్ పాండే, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, అన్రిచ్ నార్ట్జే, వరుణ్ చకరవర్తి
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ