
నేడు బెంగళూరుతో హైదరాబాద్‌కు కీలక మ్యాచ్
దుబాయ్/ షార్జా: ఆల్‌రౌండ్ షోతో లాస్ట్ మ్యాచ్‌లో బలమైన ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాకిచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తమకు చావోరేవో లాంటి మరో మ్యాచ్‌కు రెడీ అయ్యింది. డబుల్ హెడర్‌లో భాగంగా శనివారం సాయంత్రం షార్జాలో జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఢీ కొట్టనుంది. ప్లే ఆఫ్ రేస్ నేపథ్యంలో ఇరుజట్లకు ఈ మ్యాచ్ కీలకం. లీగ్‌లో ఇప్పటిదాకా 12 మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్10 పాయింట్లు సాధించింది. దీంతో మిగిలిన (బెంగళూరు, ముంబై) రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. పాయింట్లకు తోడు మెరుగైన నెట్‌రన్ రేట్‌తోనే సన్‌రైజర్స్ ముందడుగు వేయగలదు. దీంతో ఆరెంజ్ ఆర్మీకి భారీ విక్టరీలు కావాలి. అలా కాకుండా ఏ ఒక్కదానిలో ఓడినా సన్‌రైజర్స్ ఐపీఎల్13 జర్నీ లీగ్ స్టేజ్‌లోనే ముగుస్తుంది. మరోపక్క బెంగళూరుది కాస్త మెరుగైన పరిస్థితి. 12 మ్యాచ్‌లాడి 14 పాయింట్లు సాధించిన బెంగళూరు.. తమకు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది. రెండింటిలోనూ ఓడితే మిగిలిన టీమ్స్ రిజల్ట్స్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. జట్లు విషయానికొస్తే ఢిల్లీపై సాధించిన విక్టరీతో సన్‌రైజర్స్ కాన్ఫిడెన్స్ పెరిగింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్, మనీశ్ పాండేతోపాటు వృద్ధిమాన్ సాహా ఫామ్ కొనసాగిస్తే హైదరాబాద్‌కు తిరుగుండదు. అయితే, గాయపడిన సాహాను ఈ మ్యాచ్‌లో ఆడిస్తారో లేదో ఇంకా క్లారిటీ లేదు. బౌలర్లు కూడా రాణిస్తే హైదరాబాద్‌కు తిరుగుండదు. మరోపక్క బెంగళూరు కూడా అన్ని విభాగాల్లో బలంగా ఉంది. యంగ్‌స్టర్ దేవదత్ పడిక్కల్ సూపర్ ఫామ్‌లో ఉండగా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ బ్యాటింగ్‌లో మూలస్తంభాలు. జోష్ ఫిలిప్, ఆరోన్ ఫించ్‌లో ఎవరిని సెలెక్ట్ చేస్తారో చూడాలి. ఇక, మోరిస్, సిరాజ్, గురుకీరత్, చహల్, సుందర్‌తో బౌలింగ్ లైనప్ కూడా పటిష్టంగా ఉంది. కాగా. సీజన్ స్టార్టింగ్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు గెలిచింది.
టాప్ ప్లేస్‌పై ముంబై గురి
డబుల్ హెడర్‌లో భాగంగా మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకున్న ముంబై .. టేబుల్ టాప్ ప్లేస్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది. హ్యాట్రిక్ ఓటములతో ఒత్తిడిలో ఉన్న ఢిల్లీ.. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటిదాకా 12 మ్యాచ్‌లాడిన ఢిల్లీ 14 పాయింట్లతో (థర్డ్ ప్లేస్) మిగిలిన టీమ్స్‌తో పోలిస్తే చాలా సేఫ్ ప్లేస్‌లో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్స్‌లో ఉంటుంది. దీంతో బలమైన ముంబైకి షాకిచ్చి నాకౌట్ రౌండ్‌కు చేరాలని భావిస్తుంది. బలాబలాల పరంగా రెండు టీమ్స్సమంగా ఉన్నా ఢిల్లీ టాపార్డర్ బ్యాట్స్‌మెన్ రాణించడంపైనే వారి విజయం ఆధారపడి ఉంది.
For More News..