ఆకాశంలో సూపర్ బ్లూ మూన్.. బ్లూ మూన్ అంటే చంద్రుడు నీలి రంగులో ఉంటాడా..?

ఆకాశంలో సూపర్ బ్లూ మూన్.. బ్లూ మూన్ అంటే చంద్రుడు నీలి రంగులో ఉంటాడా..?

అంతరిక్షంలో  ఆగస్ట్ 30న అద్భుతమైన... అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. రోజులా కాకుండా చంద్రుడు చాలా కొత్తగా..డిఫ్రెంట్ గా..అతి పెద్దగా కనిపించబోతున్నాడు. చంద్రుడు సూపర్ బ్లూ మూన్‌ గా మారబోతున్నాడు. 

సూపర్ బ్లూ మూన్‌ అంటే చంద్రుడి కలర్ మారుతుందా..?

సూపర్ బ్లూ మూన్ అనగానే చంద్రుడు కలర్ మారుతాడా..? చంద్రుడు నీలి రంగులో కనిపిస్తాడా అన్న సందేహం అందరిలో వ్యక్తం అవుతుంది. కానీ అసలు నిజం అది కాదు. బ్లూ మూన్ అంటే చంద్రుడు బ్లూ కలర్ లోకి మారడం కాదు. ఒకే నెలలో రెండు పౌర్ణములు వస్తే .. ఆ పౌర్ణమి నాటి చంద్రుడిని సూపర్ బ్లూ మూన్ అంటారు.

మరి సూపర్ మూన్ అంటే..

చంద్రుడు భూమికి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు పౌర్ణమి వస్తే.. ఆ రోజు చంద్రుడిని సూపర్ మూన్ అంటారు. సాధారణంగా 25 శాతం  పౌర్ణమి చంద్రుడు సూపర్ మూన్ లుగా మారుతాడు. కానీ కేవలం 3 శాతం  పౌర్ణమి చంద్రుడు మాత్రం సూపర్ బ్లూ మూన్ గా మారుతాడు.  సూపర్‌ బ్లూ మూన్‌ సమయంలో సాధారణంగా పౌర్ణమి నాడు కనిపించే చంద్రుడి కన్నా 16 శాతం కాంతివంతంగా కనిపిస్తాడు.  సాధారణం కంటే పెద్దగా కనిపిస్తాడు. ఈ సూపర్‌ బ్లూ మూన్‌ ఈ ఏడాదిలో మూడో అతిపెద్ద సూపర్‌ బ్లూ మూన్‌.

బ్లూ మూన్ ఏ టైంలో ఏర్పడుతుందంటే..

ఆగస్ట్ 30న సాయంత్రం 7 గంటల 10 నిమిషాల నుంచి ఆకాశంలో సూపర్ బ్లూ మూన్ ఆగమనం ప్రారంభమవుతుంది. ఈ సూపర్ బ్లూ మూన్ ఆగస్ట్ 31 తెల్లవారుజామున 3 గంటల  36 నిమిషాల వరకు  ఉంటుంది. చివరిసారిగా బ్లూ బూన్‌ 2009 డిసెంబర్‌లో ఏర్పడింది.  మళ్లీ ఆగస్టు 30వ తేదీన ఏర్పడుతుంది. మళ్లీ  2032, 2037 ఆగస్టులో ఏర్పడబోతుంది.