Tools & Gadjets : మల్టీఫంక్షనల్ మానిటర్ స్టాండ్‌‌.. నాలుగు USB పోర్ట్స్ ..లైటింగ్ స్పెషల్‌ అట్రాక్షన్‌

Tools & Gadjets : మల్టీఫంక్షనల్ మానిటర్ స్టాండ్‌‌.. నాలుగు USB పోర్ట్స్ ..లైటింగ్ స్పెషల్‌ అట్రాక్షన్‌

చిన్న టేబుల్‌‌పై కంప్యూటర్‌‌‌‌/ల్యాప్‌‌టాప్‌‌ పెట్టుకుని పనిచేసేవాళ్లకు ఏసర్‌‌‌‌ కంపెనీకి చెందిన ఈ మల్టీఫంక్షనల్ మానిటర్ స్టాండ్‌‌ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ మొబైల్, టాబ్లెట్ హోల్డర్​తోపాటు స్టోరేజీ కంపార్ట్‌‌మెంట్ ఉంటుంది. ఆకట్టుకునే ఆర్జీబీ లైటింగ్ దీనికి స్పెషల్‌ అట్రాక్షన్‌.  దీన్ని మన్నికైన అల్యూమినియం, ప్లాస్టిక్‌తో తయారుచేశారు. కాబట్టి దాదాపు 15 కేజీల వెయిట్‌‌ని కూడా మోయగలదు. ఇది నాలుగు యూఎస్‌‌బీ పోర్ట్‌‌లతో వస్తుంది. వాటిని డేటా ట్రాన్స్‌‌మిషన్, గాడ్జెట్స్‌‌కి చార్జింగ్ పెట్టుకోవడానికి ఉపయోగించవచ్చు. ఇది వైర్‌‌లెస్ కీబోర్ట్‌‌, మౌస్‌‌, ఐప్యాడ్స్‌‌, కిండిల్స్, ప్రింటర్లు, ఎక్స్‌‌టర్నల్‌‌ హార్డ్ డ్రైవ్‌‌లు, కార్డ్ రీడర్లకు కూడా సపోర్ట్‌‌ చేస్తుంది. దీని ధర కేవలం  రూ. 1999..

–వెలుగు, లైఫ్​–