సూపర్‌‌‌‌ ర్యాపిడ్‌‌‌‌ అండ్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌ టోర్నీలో ఐదో స్థానంలో గుకేశ్‌‌‌‌

సూపర్‌‌‌‌ ర్యాపిడ్‌‌‌‌ అండ్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌ టోర్నీలో ఐదో స్థానంలో గుకేశ్‌‌‌‌

వార్సా (పోలెండ్‌‌‌‌): ఇండియా గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌, వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ డి. గుకేశ్‌‌‌‌.. సూపర్‌‌‌‌ ర్యాపిడ్‌‌‌‌ అండ్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌ టోర్నీలో మిశ్రమ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. బ్లిట్జ్‌‌‌‌ విభాగంలో శుక్రవారం రాత్రి తొమ్మిది రౌండ్స్‌‌‌‌ ముగిసేసరికి గుకేశ్‌‌‌‌ 4 పాయింట్లు సాధించాడు. 

రొడోస్లామ్‌‌‌‌ వోజ్టసెక్‌‌‌‌, ఫిరౌజా అలీరెజా, ఫ్యాబియానో కరువానా, జావోకిర్‌‌‌‌ సిందరోవ్‌‌‌‌ చేతిలో ఓడిన గుకేశ్‌‌‌‌.. తర్వాతి రౌండ్లలో  హాన్స్‌‌‌‌ మోక్‌‌‌‌ నీమన్‌‌‌‌, జాన్‌‌‌‌ క్రిజిస్టోఫ్‌‌‌‌ డుడాపై గెలిచి రేసులోకి వచ్చాడు. ర్యాపిడ్‌‌‌‌ విభాగంలో 18 పాయింట్లకు గాను 9 పాయింట్లు సాధించిన ఇండియన్‌‌‌‌ గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ బ్లిట్జ్‌‌‌‌లో 4 పాయింట్లు నెగ్గాడు. ఓవరాల్‌‌‌‌గా మొత్తం 27 పాయింట్లకుగాను 13 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. నీమాన్‌‌‌‌ (16.5), వెస్లీ సో (16) టాప్‌‌‌‌–2లో ఉండగా.. కరువానా, వ్లాదిమిర్‌‌‌‌ ఫెడోసీవ్‌‌‌‌ చెరో 15 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. బ్లిట్జ్‌‌‌‌లో మరో 9 రౌండ్లు మిగిలి ఉన్నాయి.