
గోదావరిఖని, వెలుగు : గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా హాస్పిటల్లో ఆదివారం హైదరాబాద్ కేర్ హాస్పిటల్ సమన్వయంతో సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఆర్జీ 1 ఏరియా జీఎం డి.లలిత్ కుమార్ ప్రారంభించి పరిశీలించారు. ఈ శిబిరంలో 400 మందికి పైగా కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ట్రీట్మెంట్, మందులతో పాటు అవసరమైన వారికి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ హాస్పిటల్కు రిఫర్చేశారు.
ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. స్థానికంగా ఉన్న వారు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా అనారోగ్య సమస్యలకు ట్రీట్మెంట్ ఇచ్చేందుకు కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆఫీసర్లు, డాక్టర్లు, యూనియన్ లీడర్లు పాల్గొన్నారు.