రుచికరంగా ఉంటూనే ఆరోగ్యాన్నిచ్చే వాటిలో మిల్లెట్స్ టాప్ ప్లేస్‌లో ఉంటాయి. అలాంటి మిల్లెట్స్‌ను అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు అంటున్నారు ఎక్స్పర్ట్స్. అయితే, వండే తీరు తెలియక చాలామంది వంటింట్లో చిరుధాన్యాల ఊసే కనిపించదు. మరి పిల్లలు బలంగా ఉండాలంటే సజ్జలతో తయారు చేసిన వంటకాలు కచ్చితంగా పెట్టాలి. అప్పుడే పుష్టిగా తయారవుతారు. ఒక్కసారి తింటే వదలని సజ్జల లడ్డు ఎలా తయారు చేయాలి.. ఏమేమి కావాలి.. మొదలగు విషయాలను ఈస్టోరీలో తెలుసుకుందాం. . .
సజ్జలతో లడ్డు తయారీకి కావాల్సినవి
- సజ్జలు: ఒకటిన్నర కప్పు
- నెయ్యి, పల్లీలు: అర కప్పు
- బెల్లం: ఒక కప్పు
- జీడిపప్పు, బాదం, ఎండు కొబ్బరి: ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్లు
- యాలకుల పొడి: అర టీస్పూన్
- ఎడిబుల్ గమ్: అర కప్పు (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది)
తయారీవిధానం : పాన్‌లో నెయ్యి వేడి చేసి అందులో సజ్జ పిండి వేసి వేగించాలి. అందులో పల్లీలు, జీడిపప్పు, బాదం తరుగు, ఎండు కొబ్బరి తురుము, ఎడిబుల్ గమ్, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. మరో పాన్‌లో బెల్లం వేసి కరిగించిన పాకాన్ని కూడా ఇందులో వేసి కలపాలి. కాస్త వేడిగా ఉండగానే లడ్డూలు చేయాలి.
–వెలుగు, లైఫ్–
