
వివరాలు వెల్లడించిన సూపరింటెండెంట్ రాజారావు
పద్మారావునగర్, వెలుగు : గాంధీ హాస్పిటల్లో విద్యుత్ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయినట్లు సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. రూ.13 కోట్ల 55 లక్షలతో తొందరలోనే పనులు చేపట్టేందుకు తెలంగాణ వైద్యవిద్య మౌలిక సదుపాయాల కల్పనాసంస్థ అధికారులు ప్లానింగ్ రూపొందించారన్నారు. మొదటి విడతలో భాగంగా రూ.9 కోట్ల 89 లక్షల పనులను శాంతి ఎంటర్ ప్రైజెస్ ఎలక్ట్రికల్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ దక్కించుకుందన్నారు.
ఈ మేరకు శుక్రవారం గాంధీ హాస్పిటల్ అధికారులు, టీఎస్ఎంఎస్ఐడీసీ ఇంజనీర్లు,టెండర్ దారులతో ఆయన సమావేశమయ్యారు. పనులకు సంబంధించిన బ్లూ ప్రింట్ ను సంబంధిత ఇంజనీర్లు సూపరింటెండెంట్ రాజారావుకు అందించారు. కార్యక్రమంలో గాంధీ హాస్పిటల్ అధికారులు, టీఎస్ఎంఎస్ఐడీసీ ఈఈ (సివిల్) శ్రీనివాస్, ఎలక్ట్రికల్ ఈఈ అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.