శివుని అవతారంలో సూపర్ స్టార్ కృష్ణ

 శివుని అవతారంలో సూపర్ స్టార్ కృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ‘జటాధర’ టీమ్ ఆయనకు ట్రిబ్యూట్‌‌గా సరికొత్త పోస్టర్‌‌‌‌ను రిలీజ్ చేసింది.  కృష్ణను శివుని అవతారంలో చూపిస్తూ విడుదల చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంది. 

‘తెలుగు వెండితెర‌‌పై దేవుడిగా భావించే, సిల్వర్ స్క్రీన్ తుఫానుగా చూచే, సినిమా ప్రపంచాన్ని ఎప్పటికీ ప్రభావితం చేసే శ‌‌క్తిగా లెజండరీ యాక్టర్‌‌ సూప‌‌ర్‌‌స్టార్ కృష్ణను ‘జ‌‌టాధ‌‌ర’ చిత్రయూనిట్ స్మరించుకుంది’ అంటూ పోస్ట్ చేశారు. చిత్రీక‌‌ర‌‌ణ‌‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌‌క్షన్ కార్యక్రమాల‌‌ను ప్రారంభించింది.  సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్‌‌‌‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా హీరోయిన్‌‌గా నటిస్తోంది. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకులుగా రూపొందిస్తుండగా,  జీ స్టూడియోస్  సమర్పణలో ఉమేష్ కె.ఆర్.బన్సాల్,  ప్రేరణ అరోరా నిర్మిస్తున్నారు.