
ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాజిల్, కీర్తి సురేష్ లీడ్ రోల్స్ లో మారిసెల్వరాజ్ రూపొందించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘మామన్నన్’. ఇటీవల తమిళంలో విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘నాయకుడు’ టైటిల్‌తో జులై 14న సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ సంస్థలు విడుదల చేస్తున్నాయి.
శుక్రవారం తెలుగు ట్రైలర్‌ను హీరో మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి రిలీజ్ చేసి మూవీ టీమ్‌కి బెస్ట్ విషెస్ చెప్పారు. పదవి కోసం కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే రాజకీయ నాయకుడిగా ఫహద్ కనిపిస్తున్నాడు. అతని అరాచకాన్ని అడ్డుకునే పాత్రల్లో వడివేలు, ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్ పవర్‌ఫుల్ రోల్స్ పోషించారు.
ఏ.ఆర్.రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఆకట్టుకుంది. ప్రజల క్షేమం కోరే నాయకుడు ఎలా ఉండాలనే పాయింట్‌తో కట్ చేసిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.