మాకు సంక్రాంతి సెంటిమెంట్ కలిసొచ్చింది

మాకు సంక్రాంతి సెంటిమెంట్ కలిసొచ్చింది

మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా వస్తున్న మూవీ హీరో ఈ నెల 15 న (శనివారం) విడుదుల కాబోతుంది. ఈ సందర్బంగా తన మేనల్లుడు అశోక్ కు, మూవీ టీంకు మహేశ్ బాబు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. తమ కుటుంబం నుంచి మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం కాబోతున్నాడన్నారు.   నాన్న అభిమానులు, తన అభిమానులు గల్లా  అశోక్ ను ఆదరించాలని కోరారు.  హీరో సినిమాను ఘన విజయం చేయాలని కోరారు. హీరో సినిమాను తాను చూశానని..తనకు చాలా బాగా నచ్చిందన్నారు మహేశ్. సంక్రాంతి పండగ సెంటిమెట్ నాన్నకు బాగా కలిసొచ్చిందని..తనకు కూడా కలిసొచ్చిందన్నారు. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన ఒక్కడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, సరిలేరు నీకెవ్వరు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయని అన్నారు.