చంద్రయాన్3 విజయాన్ని చూసి అగ్రరాజ్యాలు ఆశ్చర్యపోతున్నాయి: రజనీకాంత్

చంద్రయాన్3 విజయాన్ని చూసి అగ్రరాజ్యాలు ఆశ్చర్యపోతున్నాయి: రజనీకాంత్

చంద్రయాన్ -3(Chandrayan-3) విజయంతో భారత్.. అంతరిక్ష పరిశోధనలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. చంద్రుడి దక్షిణ దృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి.. ప్రపంచ దేశాలన్నింటినీ తన వైపుకు తిప్పుకుంది. ఈ విజయంతో ప్రపంచ దేశాల అగ్రనేతలు, ప్రముఖులందరూ ఇస్రో సైంటిస్టుల ప్రతిభను కొనియాడుతున్నారు. ఇక తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) కూడా చంద్రయాన్ 3 సక్సెస్ పై స్పందించారు. ఈ విజయం భారతీయలను గర్వపడేలా చేసింది అంటూ ట్వీట్ చేశాడు.

అమెరికా, చైనా, రష్యా వంటి అగ్ర దేశాలు ఆశ్చర్యంతో చూస్తుండగా.. భారతదేశం ఈ భారీ విజయంతో కొత్త చరిత్రను సృష్టించింది. మొట్టమొదటిసారిగా చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 ని ల్యాండ్ చేయడం ద్వారా ఇండియా గొప్ప గుర్తింపును అందుకుంది. ఈ సంధర్బంగా మన ఇస్రో శాస్త్రవేత్తల టీమ్ కు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు మమ్మల్ని, మన దేశాన్ని గర్వపడేలా చేశారు అంటూ ట్వీట్ చేశారు రజనీకాంత్. ప్రస్తుతం రజని చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.