తలైవా తయార్‌‌‌‌

V6 Velugu Posted on Nov 26, 2021

రజినీకాంత్ లాంటి మాస్‌‌ హీరో మూవీ థియేటర్స్‌‌కి వచ్చిందంటే రివ్యూలు, సినిమా టాక్‌‌తో సంబంధం లేకుండా వందల కోట్ల వసూళ్లు కచ్చితంగా వచ్చేస్తాయి. రొటీన్ మూవీ అనే టాక్ వచ్చిన ‘అన్నాత్తే’ విషయంలోనూ ఇదే జరిగింది. కలెక్షన్ల వర్షం కురిసింది. దాంతో రజినీకాంత్ నెక్స్ట్‌‌ సినిమా ఎవరితో ఉండబోతోందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ‘అన్నాత్తే’ డైరెక్టర్‌‌‌‌ శివతోనే మరో సినిమా చేసేందుకు రజినీ ఓకే చెప్పారనే వార్తలు కొద్ది రోజులుగా వస్తున్నాయి. కానీ ఇప్పుడు మరో దర్శకుడి పేరు గట్టిగా వినిపిస్తోంది. అతనే పాండిరాజ్.

హ్యూమన్ ఎమోషన్స్‌‌ని అద్భుతంగా చూపిస్తాడని పాండి రాజ్​కి పేరుంది. ఇప్పటివరకు శివకార్తికేయన్, శింబు, విశాల్, సూర్య లాంటి హీరోలతో వర్క్ చేసిన ఆయన.. ఈసారి రజినీని డైరెక్ట్ చేయబోతున్నాడట. తను చెప్పిన కథ నచ్చడంతో సూపర్ స్టార్‌‌‌‌ నుంచి గ్రీన్‌‌ సిగ్నల్ వచ్చేసిందట కూడా. ‘అన్నాత్తే’ను నిర్మించిన సన్ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌లోనే ఈ సినిమా కూడా ఉంటుందని టాక్. వచ్చే ఏడాది స్టార్ట్ అయ్యే చాన్స్ ఉంది. ఇక ప్రస్తుతం సూర్యతో ‘ఎదర్కుమ్ తుణీందవన్‌‌’ అనే యాక్షన్ థ్రిల్లర్ తీస్తున్నాడు పాండిరాజ్. ఫిబ్రవరిలో విడుదల. అలాగే ధనుష్‌‌తోనూ ఓ మూవీ చేయాల్సి ఉంది. మరి ఆ సినిమా ముందు చేస్తాడో, రజినీతో సినిమా మొదట స్టార్ట్ చేస్తాడో. అసలీ వార్తలో ఎంత నిజముందో!

Tagged Actor Rajinikanth, Annatthe, Director Pandiraj, Sun Pictures Banner, Rajinikanth Next Movie

Latest Videos

Subscribe Now

More News