స్వీపర్ల వద్ద నెలవారీగా మామూళ్ల వసూలు

స్వీపర్ల వద్ద నెలవారీగా మామూళ్ల వసూలు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో శానిటేషన్ అధికారులపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. శానిటేషన్ సూపర్ వైజర్లు GHMC కార్మికుల నుంచి ప్రతీ నెలా మామూళ్లు వసూళ్లు చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. మొన్నటి దాకా ఒక్కొక్కరి నుంచి 500 రూపాయలు వసూలు చేశారని.. ఇప్పుడు వెయ్యి రూపాయలు ఇవ్వాలని సూపర్ వైజర్లు డిమాండ్ చేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపుగా 18వేల మంది కార్మికులు ఉంటారు. వీరందరి నుంచి నెల నెలా డబ్బులు వసూలు చేస్తారని, ఒక వేళ ఎవరైనా డబ్బులు ఇవ్వకుంటే వారిని టార్చర్ చేస్తారని కార్మికులు చెప్తున్నారు. బేగంపేట్ సర్కిల్ లో పని చేస్తున్న ఓ కార్మికురాలు డబ్బులు ఇవ్వలేదని, వారి సూపర్వైజర్ ఆమె మీద దాడి చేయించినట్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది.

మరిన్ని వార్తల కోసం..

రైతులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చెలగాటం

రాజ్యసభ నుంచి టీఆర్ఎస్ ఎంపీల వాకౌట్

ఆస్తినంతా రాహుల్‌ గాంధీకి రాసిచ్చిన పుష్ప