ఆస్తినంతా రాహుల్‌ గాంధీకి రాసిచ్చిన పుష్ప

ఆస్తినంతా రాహుల్‌ గాంధీకి రాసిచ్చిన పుష్ప

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ బామ్మ తన ఆస్తినంతా రాసిచ్చేసింది. దీనికి సంబంధించిన వీలునామాను రాహుల్‌కు అందజేసింది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు చెందిన 78 ఏళ్ల బామ్మ పుష్ప మాంజీలాల్‌.. రూ.50 లక్షల విలువ చేసే ఆస్తులతో పాటు 10 తులాల బంగారాన్ని కూడా రాహుల్ పేరున రాశారు. ఆ వీలునామాను డెహ్రాడూన్ జిల్లా కోర్టులో ఫైల్ చేసింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను డెహ్రాడూన్ మెట్రోపాలిటన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ లాల్‌చంద్ శర్మకు అందజేశారు. రాహుల్ గాంధీ ఆలోచనలు, ఆశయాలకు ప్రభావితమై తన ఆస్తినంతా ఇచ్చేసినట్లు పుష్ప మాంజీలాల్ చెప్పింది. రాహుల్‌పైన అబిమానంతో.. ఆస్తిని రాసిచ్చినట్లు తెలిపారు. దానిని రాహుల్ గాంధీకి చేరేలా చూడాలని కోరింది. గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని, సోనియా, రాహుల్ గాంధీ కూడా తమ జీవితాలను దేశ సేవకు అంకితం చేశారని చెప్పింది. దేశ సేవలో తన ఆస్తి కూడా ఉపయోగపడాలని ఈ  పని చేశానని తెలిపింది ఆ బామ్మ.

మరిన్ని వార్తల కోసం..

లంక బాటలోనే భారత్.. తీవ్ర సంక్షోభం తప్పదు

15 రోజుల్లో 13వ సారి పెరిగిన పెట్రోల్ రేటు

మాట నిలబెట్టుకున్న రాజమౌళి