లంక బాటలోనే భారత్.. తీవ్ర సంక్షోభం తప్పదు

లంక బాటలోనే భారత్.. తీవ్ర సంక్షోభం తప్పదు

ముంబై: ద్వీప దేశం శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ విషయంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. భారత్ కూడా లంక బాటలోనే నడుస్తోందన్నారు. ‘శ్రీలంక పరిస్థితి చాలా విచారకరంగా ఉంది. ఇండియా కూడా అదే దారిలో ఉంది. దీన్ని త్వరగా పరిష్కరించాలి లేకపోతే మన దేశ పరిస్థితి లంక కంటే దారుణంగా తయారయ్యే ప్రమాదం పొంచి ఉంది’ అని రౌత్ చెప్పారు. ఈ సంక్షోభంపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ  పిలుపునిచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. 

ఇకపోతే, శ్రీలంకలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నిత్యావసరాల ధరల పెరుగుదలపై ప్రజాగ్రహం పెల్లుబుకుతుండటంతో ప్రధాని మహింద రాజపక్స మినహా మిగతా మంత్రులంతా ఆదివారం తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఆర్థిక పరిస్థితిని, ఆందోళనలను చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వంలో చేరాలంటూ విపక్షాలకు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఆహ్వానం పలికారు. కానీ ప్రతిపక్ష నేతలు అందుకు తిరస్కరించారు.  

మరిన్ని వార్తల కోసం:

మాట నిలబెట్టుకున్న రాజమౌళి

నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారిపై కూలిన గోడ

44 వారాల కఠోర శిక్షణ పూర్తి చేసుకున్న జవాన్లు