15 రోజుల్లో 13వ సారి పెరిగిన పెట్రోల్ రేటు

15 రోజుల్లో 13వ సారి పెరిగిన పెట్రోల్ రేటు

దేశవ్యాప్తంగా మరోసారి పెట్రో ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. పెట్రోల్, డీజిల్ పై 80 పైసలు చొప్పున పెంచాయి. గత 15 రోజుల వ్యవధిలో ధరలు పెంచడం ఇది 13 వసారి. రెండు వారాల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ పై దాదాపు 10 రూపాయల వరకు రేట్లు పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 118 రూపాయల 59 పైసలు, డీజిల్ 104 రూపాయల 62 పైసలకు పెరిగింది.

ఢిల్లీలో పెట్రోల్ 104 రూపాయల 61 పైసలు, డీజిల్ 95 రూపాయల 87 పైసలకు చేరింది. ముంబైలో పెట్రోల్ 119 రూపాయల 67 పైసలు, డీజిల్ 103 రూపాయల 92 పైసలకు పెరిగింది. కోల్‌కతాలో పెట్రోల్ 114 రూపాయల 28 పైసలు, డీజిల్ 99 రూపాయల 2 పైసలుగా ఉంది. చెన్నైలో పెట్రోల్ 110 రూపాయల 11 పైసలు, డీజిల్ 100 రూపాయల 19 పైసలకు చేరింది. బెంగళూరులో పెట్రోల్ 110 రూపాయల 25 పైసలు, డీజిల్ 94 రూపాయల 1 పైసలకు పెరిగింది. విశాఖలో పెట్రోల్ 119 రూపాయల 47 పైసలు, డీజిల్ 105 రూపాయల 13 పైసలుగా ఉంది.

మరిన్ని వార్తల కోసం..

'కట్నం వల్ల కలిగే లాభాలు' అంటూ  పాఠాలు

గ్రేటర్​ జనం వారం తాగునీటి ఖర్చు 40 కోట్లు

మురారి సినిమా.. రీమేక్ చేయాలనుంది