సెక్రటేరియట్ నుంచి అమరావతికి సామాగ్రి

సెక్రటేరియట్ నుంచి అమరావతికి సామాగ్రి

సచివాలయంలోని ఏపీ బ్లాకుల్లో ఉన్న సామగ్రిని అధికారులు ఆ రాష్ట్ర రాజధాని అమరావతికి తరలించారు. సోమవారం హెచ్, నార్త్ హెచ్, జే, కే , ఎల్ బ్లా కుల్లో ఉన్న ఫర్నిచర్, బీరువాలు, టేబుళ్లతోపాటు ఇతర సామగ్రిని శాఖలవారీగా విభజించి ప్యాక్ చేసి లారీల్లో పంపారు. రెండు, మూడు రోజుల్లో సామగ్రి తరలింపు పూర్తవుతుం దని అధికారులు చెప్పారు. సచివాలయంలోని తమ బ్లా కులను తెలంగాణకు కేటాయిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కారు జీవో కూడా జారీ చేసింది.