స్టేట్ లెవెల్ ’ఖేలో’ గేమ్స్‌ ను సపోర్ట్ చేయండి:  క్రీడల మంత్రి కిరణ్ రిజిజు

స్టేట్ లెవెల్ ’ఖేలో’ గేమ్స్‌ ను సపోర్ట్ చేయండి:  క్రీడల మంత్రి కిరణ్ రిజిజు

న్యూఢిల్లీ: స్టేట్‌‌‌‌ లెవెల్‌‌‌‌ ఖేలో ఇండియా గేమ్స్‌‌‌‌ నిర్వహణలో రాష్ట్రాలు చురుగ్గా వ్యవహరించాలని సెంట్రల్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌ మినిస్టర్‌‌‌‌ కిరణ్‌ రిజిజు అన్నారు. గ్రౌండ్‌‌‌‌ లెవెల్‌‌‌‌లో టాలెంట్‌‌‌‌ను వెలికితీయడంలో ఈ గేమ్స్‌‌‌‌ కీలకపాత్ర పోషిస్తున్నా యని ఆయన పేర్కొన్నారు. మంగళవారం జరిగిన ఖేలో ఇండియా స్కీమ్‌‌‌‌ తొలి జనరల్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ మీటింగ్‌‌‌‌లో రిజిజు మాట్లా డుతూ.. ‘ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌‌‌‌, యూనివర్సిటీ గేమ్స్‌‌‌‌ పేరిట జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల ద్వారా ఎంతో మంది టాలెంటెడ్‌‌‌‌ ప్లేయర్లను గుర్తించగలిగాం. కానీ అది సరిపోదు. ఇప్పటికే వార్షిక స్పోర్టింగ్‌‌‌‌ కాంపిటీషన్స్‌‌‌‌ నిర్వహిస్తున్న రాష్ట్రాలు కూడా ఖేలో ఇండియా స్కీమ్‌‌‌‌తో జత కట్టాలి. దాంతో ఆయా ఈవెంట్ల నిర్వహణకు కేంద్రం నుంచి సహకారం లభిస్తుంది.

స్పోర్ట్స్‌‌‌‌లో ఇండియాను సూపర్‌‌‌‌ పవర్‌‌‌‌గా తయారు చేయాలంటే 5–10 ఏళ్లలోపు వయసున్న టాలెంటెడ్‌‌‌‌ ప్లేయర్లను గుర్తించాలి. ఎందుకంటే ఓ వ్యక్తిని ఒలింపిక్‌‌‌‌ స్థాయి అథ్లెట్‌‌‌‌గా చేయడానికి కనీసం ఎనిమిదేళ్ల సమయం పడుతుంది. టాలెంట్‌‌‌‌ హంట్‌‌‌‌కు రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందించాలి’ అని అన్నారు. అంతేకాక ఖేలో ఇండియా స్టేట్‌‌‌‌ సెంటర్‌‌‌‌ ఫర్‌‌‌‌ ఎక్స్‌‌‌‌లెన్స్‌‌‌‌ కేంద్రాల ఆవశ్యకతను ప్రస్తావించారు. ఓ సీనియర్‌‌‌‌ అథ్లెట్‌‌‌‌ ట్రెయినింగ్‌‌‌‌కు అవసరమైన అన్ని సదుపాయాలుండే ఈ సెంటర్లను ఎంపిక చేసిన ఎనిమిది రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నారు.