సంజయ్ రౌత్ కు సుప్రీం నోటీసులు ..సీజేఐ, న్యాయవ్యవస్థ మీద వ్యాఖ్యలపై సీరియస్‌‌‌‌‌‌‌‌

సంజయ్ రౌత్ కు సుప్రీం నోటీసులు ..సీజేఐ, న్యాయవ్యవస్థ మీద వ్యాఖ్యలపై సీరియస్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌‌‌‌‌‌‌‌, న్యాయవ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్‌‌‌‌‌‌‌‌ రౌత్‌‌‌‌‌‌‌‌, సీనియర్‌‌‌‌‌‌‌‌ జర్నలిస్ట్‌‌‌‌‌‌‌‌ నిఖిల్‌‌‌‌‌‌‌‌ వాగ్లేకు సుప్రీంకోర్టు శుక్రవారం క్రిమినల్‌‌‌‌‌‌‌‌ ధిక్కార నోటీసులు జారీ చేసింది. ప్రతిపక్ష నేతల బృందాన్ని కలిసేందుకు సీజేఐ నిరాకరించిన నేపథ్యంలో వీరు చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు బార్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌ వేసింది.

 సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌‌‌‌‌‌‌‌, జస్టిస్‌‌‌‌‌‌‌‌ జాయ్ మాల్య బాగ్చీ బెంచ్​ ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌పై విచారణ జరిపింది. న్యాయమూర్తులు రాజకీయ కార్యక్రమాలకు వెళ్తారు కానీ, ప్రతిపక్ష నేతలను మాత్రం కలవరని రౌత్‌‌‌‌‌‌‌‌ విమర్శించినట్లు పిటిషన్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. లండన్‌‌‌‌‌‌‌‌లో రాజకీయ ప్రముఖులతో న్యాయమూర్తులు బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌ ఆడిన ఫొటోలనూ ప్రస్తావించినట్లు తెలిపారు. వాగ్లే సైతం ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌’లో అభ్యంతరకర పోస్టు పెట్టారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.