భారత సుప్రీంకోర్టు లా క్లర్క్- కమ్ -రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 7.
ఖాళీలు: 90 (లా క్లర్క్– కం – రీసెర్చ్ అసోసియేట్).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లాలో బ్యాచిలర్ డిగ్రీ (లాలో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సుతో సహా) కలిగి ఉండాలి. న్యాయవాదిగా నమోదు చేసుకోవడానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తింపు పొందాలి. లా చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థికి పరిశోధన, విశ్లేషణాత్మక నైపుణ్యాలు, రచనా సామర్థ్యాలు, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి: 20 నుంచి 32 ఏండ్ల మధ్యలో ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జనవరి 20.
లాస్ట్ డేట్: ఫిబ్రవరి 07.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష తేదీ: మార్చి 07.
పూర్తి వివరాలకు www.sci.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించండి.
ఎగ్జామ్ ప్యాటర్న్
పార్ట్–I: ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. ఈ ఎగ్జామ్ అభ్యర్థులు చట్టాన్ని అర్థం చేసుకుని, దానిని వర్తింపజేయగల సామర్థ్యాన్ని, కాంప్రహెన్షన్ నైపుణ్యాలను పరీక్షించేలా ఉంటుంది. కనీస అర్హత సాధించాలంటే 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
పార్ట్ – II : సమాధానాలు వ్యాస రూపంలో రాయాల్సి ఉంటుంది. ఇందులో అభ్యర్థి రచన, విశ్లేషణాత్మక నైపుణ్యాలను పరీక్షిస్తారు. ప్రశ్నపత్రం కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అభ్యర్థులు పెన్–-పేపర్ మోడ్‌లో సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
