సీల్డ్ కవర్ ఓపెన్ చేయటానికి ఏంటీ అభ్యంతరం : SBIపై సుప్రీంకోర్టు ఆగ్రహం

సీల్డ్ కవర్ ఓపెన్ చేయటానికి ఏంటీ అభ్యంతరం : SBIపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఎలక్టోరల్ బాండ్స్ కేసు విషయంలో SBIకి సుప్రీమ్ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో బాండ్ల వివరాలను ఈసీకి సమర్పించేందుకు జూన్ 30వరకూ గడువు కోరగా సుప్రీమ్ కోర్ట్ ససేమిరా అంది. మార్చ్ 15 సాయంత్రానికల్లా బాండ్ల వివరాలను వెబ్సైట్ లో పొందుపరచాలని ఆదేశించింది సుప్రీమ్ కోర్ట్. ఈ కేసుపై తీర్పు ఫిబ్రవరి 15న ఇచ్చామని, ఈ 26రోజులు ఏం చేశారని కోర్ట్ SBIని ప్రశ్నించింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కలెక్ట్ చేసే పనిలో ఉన్నామని, ఈసీకి వివరాలు సబ్మిట్ చేసేందుకు కొంత సమయం పడుతుందని SBI తెలిపింది.

ALSO READ :- This week OTT Movies: ఈవారం OTT సినిమాలు.. లిస్టులో హనుమాన్ ఉంది కానీ.!

SBI ఇచ్చిన వివరణపై సుప్రీమ్ ఆగ్రహం వ్యక్తం చెసింది.సీల్డ్ కవర్ లో వివరాలన్నీ ఉన్నప్పుడు కవర్ తెరిచి, వివరాలిస్తే సరిపోతుందని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. తీర్పు చెప్పి 26 రోజులు అవుతుంటే ఇప్పటిదాకా ఏంచేశారన్న సీజే. ఎట్టి పరిస్థితిలో సాయంత్రంలోగా ఎస్బీఐ వివరాలివ్వాల్సిందేనని సుప్రీం ఆదేశించింది. ఈనెల 15 సాయంత్రంలోపు ఈసీ వెబ్ సైట్లో వివరాలు పెట్టాలని సుప్రీం ఆదేశం SBI దగ్గర కేవైసీ ఉన్నప్పుడు వివరాలివ్వడానికి ఇబ్బంది ఏముందని సుప్రీమ్ ప్రశ్నించింది.కేవైసీ వెరిఫైడ్ కాబట్టి బాండ్లు కొన్నవారి వివరాలు రెడీగా ఉంటాయని వినతిలోనే SBI ఒప్పుకున్నట్లు సుప్రీమ్ తెలిపింది.