ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు బెయిల్

ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు బెయిల్
  • కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడొద్దని.. సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టొద్దని ఎంపీకి ఆదేశం
  • 24 గంటలు ముందు నోటీసు ఇచ్చి న్యాయవాదుల సమక్షంలోనే విచారించాని సీఐడీకి ఆదేశం

న్యూఢిల్లీ: ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు కండీషనల్ బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుతో ఇద్దరు 10 రోజుల్లోపూ పూచీకత్తు సమర్పించాలని, సీఐడీ విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి మీడియాతో ఎక్కడా మాట్లాడరాదని, సోషల్ మీడియాలో కూడా ఎలాంటి పోస్టులు పెట్టరాదని సుప్రీంకోర్టు హెచ్చరించింది.  రఘురామను విచారించాలనుకుంటే న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని, 24 గంటల ముందు నోటీసు ఇచ్చి విచారణ చేపట్టాలని సీఐడీకి ఆదేశాలిచ్చింది. ఏపీలోని నర్సాపురం పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ రఘురామకృష్ణ  తరఫున సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదించగా.. ఏపీ ప్రభుత్వం తరఫున దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం కండీషనల్ బెయిల్‌ను మంజూరు చేసింది. ఆర్మీ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులు పరీక్షించి ఎక్స్‌రే, వీడియో కూడా పంపారని ధర్మాసనం తెలిపింది. ఎంపీకి జనరల్‌ ఎడిమా ఉందని, ఫ్రాక్చర్ కూడా అయినట్లు నివేదికలో ఉందన్నారు. ఆర్మీ ఆస్పత్రి వైద్యుల బృందం సమర్పించిన నివేదికను సుప్రీం పరిశీలించింది.