మా తెలంగాణ పార్టీకి సుప్రీంకోర్టు లక్ష ఫైన్

మా తెలంగాణ పార్టీకి సుప్రీంకోర్టు లక్ష ఫైన్

న్యూఢిల్లీ, వెలుగు: విలువైన కోర్టు టైంను వృథా చేసినందుకు మా తెలంగాణ పార్టీకి సుప్రీంకోర్టు రూ.లక్ష ఫైన్ వేసింది. గతంలో హైకోర్టు విధించిన రూ. 50 వేలతో పాటు తాము విధించిన రూ. లక్ష రూపాయల జరిమానా అదనమని స్పష్టం చేసింది. హైదరాబాద్ సమీపంలోని బల్క్ డ్రగ్స్, ఫార్మా స్యూటికల్ యూనిట్లు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సిస్టమ్స్ ల ఏర్పాటుపై మా తెలంగాణ పార్టీ  ప్రెసిడెంట్ కె.వీరారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. వాటి నుంచి వచ్చే విషపూరిత వ్యర్థ్యాలను తీవ్రమైనవిగా గుర్తించేందుకు అనుమతి కోరుతూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నిరుడు సెప్టెంబర్ లో తెలంగాణ హైకోర్టు సీజేతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. హైకోర్టులో పిటిషన్ దాఖలుకు ముందే ఆ అంశంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) అప్పిలేట్ అథారిటీని ఆశ్రయించిన విషయాన్ని పిటిషనర్ దాచడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధారాలు చూపకుండా కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారని  రూ.50 వేల ఫైన్ విధించింది.