వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, కేంద్రానికి సుప్రీం నోటీసులు

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, కేంద్రానికి సుప్రీం నోటీసులు

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ కొత్త ప్రైవ‌సీ పాల‌సీపై దాఖ‌లైన పిటిష‌న్‌పై సుప్రీం విచార‌ణ జ‌రిపింది. నాలుగు వారాల్లో నోటీసుల‌కు స‌మాధానం ఇవ్వాల‌ని వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ల‌ను ఆదేశించింది.

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లు బిలియన్‌, ట్రిలియన్‌ డాలర్ల కంపెనీ కావచ్చు. కానీ ప్రజల వ్యక్తిగత ప్రైవసీ అంతకన్నా విలువైనదని సుప్రీం తెలిపింది. దానిని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందంది. మీ కొత్త ప్రైవసీ పాలసీ కారణంగా తమ ప్రైవసీకీ భంగం వాటిల్లుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పింది. తాము ఎవరో ఒకరికి పంపిన మెసేజ్ లను వాట్సాప్‌, ఫేస్‌బుక్‌తో పంచుకోవడంతో వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంది. ప్రజల ప్రైవసీని కాపాడటం కోసం మేం జోక్య చేసుకోక తప్పదని చెప్పింది సుప్రీం.

దీనికి సంబంధించి కేంద్రంతో పాటు, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ తరఫున కపిల్‌ సిబాల్‌, అరవింద్‌ దాతర్‌ తమ వాదనలు వినిపించారు. ప్రైవసీకి భంగం కలుగుతుందనే ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు.