కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

కరోనా వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ డేటా, వ్యాక్సిన్ డేటాపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ బయటపెట్టాలని, నిర్బంధ టీకా ఆదేశాన్ని నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ ను న్యాయమూర్తులు విచారించారు. కొన్ని ముఖ్యమైన అంశాలను పిటిషనర్ లేవనెత్తారన్నారు. అయితే వ్యాక్సిన్ల సమర్థతపై సందేహాలను ఇప్పుడు వ్యక్తం చేయకూడదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. దేశం వ్యాక్సిన్ కొరతతో పోరాడుతోందని, ప్రస్తుత పరిస్థితుల్లో టీకాలు వేయడం ఆపాలేని చెప్పలేమని తెలిపింది. వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ డేటా, వ్యాక్సిన్ డేటా అంశంపై అభిప్రాయాలు చెప్పాలని కేంద్రానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.