
ఆదిపురుష్(Adipurush) టీమ్ కు సుప్రీం కోర్టు(Supreme court)లో ఊరట లభించింది. ఇటీవల ఈ సినిమా సీబీఎఫ్‌సీ(CBFC) సర్టిఫికేషన్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అంతేకాదు జులై 27న తమ ముందు హాజరుకావాలను చిత్ర నిర్మాతలకు అలహాబాద్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది.
కాగా.. జులై 27న ఆదిపురుష్ నిర్మాతలను తమ ముందు హాజారు కావాలని అలహాబాద్ కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ఆదిపురుష్ సినిమాపై అభిప్రాయాలను తెలియజేయడానికి కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ క్రమంలోనే సినిమాకు సీబీఎఫ్‌సీ సర్టిఫికెట్ మంజూరు చేయాలా వద్దా అనే నిర్ణయాన్ని సమీక్షించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాజాగా ఈ విషయంపై అలహాబాద్ కోర్టుకు నోటీసులు జారీచేసింది సుప్రీం కోర్టు.
ఇక ఆదిపురుష్ సినిమా విషయానికి వస్తే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) రాముడిగా కనిపించిన ఈ సినిమాను.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్(Om Raut) తెరకెక్కించారు. కృతి సనన్(Kriti sanon) సీతగా చేసిన ఈ సినిమాపై.. దేశ వ్యాప్తంగా వివాదాలు వెల్లువెత్తాయి. రామాయణాన్ని తప్పుగా చూపించారని, సినిమాను నిలిపివేయాలంటూ పిటీషన్స్ కూడా దాఖలు అయ్యాయి.