సీట్లు ఎందుకు ఖాళీగా ఉన్నాయో 24 గంటల్లో చెప్పాలి

సీట్లు ఎందుకు ఖాళీగా ఉన్నాయో 24 గంటల్లో చెప్పాలి

నీట్, పీజీలో సీట్లు భర్తీ చేయకపోవడంపై సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ఇన్ని సీట్లు ఖాళీగా ఎందుకున్నాయని నిలదీసింది. ఇలా చేయడం వైద్య విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో వైద్యుల కొరతను సృష్టించడం అవినీతికిందికే వస్తుందని వ్యాఖ్యానించింది.

నీట్, పీజీ 2021లో 1,456 సీట్లను భర్తీ చేయకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది.  సీట్లు ఖాళీలపై దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ ఎంఆర్ షా, అనిరుద్ధ బోస్ లతో కూడిన ధర్మాసనం విచారించింది. సీట్లు ఎందుకు ఖాళీగా ఉంచాల్సివచ్చిందో కారణాలు చెప్తు 24గంటల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎంసీసీ సహ కేంద్రం తరఫు న్యాయవాదిని ఆదేశించింది. సీట్లను ఖాళీగా ఉంచకుండా చూడాల్సిన బాధ్యత మెడికల్ కౌన్సిల్ దేనని వ్యాఖ్యానించింది. సీట్ల ఖాళీలను జాతీయ సమస్యగా చూస్తున్నామని ధర్మాసనం చెప్పింది. దీనిపై తుది తీర్పును జూన్ 10 న వెల్లడించనుంది కోర్టు.