ఆ 1600 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వానివే: సుప్రీం కోర్టు

ఆ 1600 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వానివే: సుప్రీం కోర్టు

సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి  ఊరట లభించింది. హైదరాబాద్ మణికొండ జాగీర్ భూముల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ల్యాంకోహిల్స్‌లో నిర్మాణాలు జరుగుతున్న1654.32 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుందని స్పష్టం చేసింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి సుప్రీం తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 2012 ఏప్రిల్‌ 3న వక్ఫ్‌ బోర్డుకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

కాగా, 2016 నుంచి మణికొండ జాగీర్ భూముల కేసు సుప్రీం కోర్టులో కొనసాగుతోంది.1654 ఎకరాలు 32 గుంటలు తమవే నంటూ వక్ఫ్‌ బోర్డు, వక్ఫ్‌ ట్రిబ్యునల్ మద్దతుతో కోర్టు కెక్కింది మణికొండ దర్గా. సుప్రీం తాజా తీర్పుతో 1,654 ఎకరాలపై ప్రభుత్వానికి సర్వ హక్కులు దక్కనున్నాయి.

మరిన్ని వార్తల కోసం..

కేసీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది