
సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునివ్వడంపై పలువురు నేతలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. ఈ కేసు నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆరుగురు ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపి అడ్వకేట్ ను నియమించారని తెలిపారు. అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నానని అన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుందని తెలిపారు.
తీర్పు సమ న్యాయం, సమ ధర్మంగా ఉందన్నారు. అణగారిన వర్గాలకు న్యాయం చేయాలని పోరాటంలో న్యాయం, ధర్మం గెలిచిందన్నారు. ఈ తీర్పు ఒక వర్గానికి వ్యతిరేకం కాదని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారని తెలిపారు. అమరులైన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా తెలిపారు.