తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన  ఆయుష్మాన్ భారత్ పథకం పలు రాష్ట్రాల్లో అమలు కాకపోవడంతో సీరియస్ అయ్యింది సుప్రీంకోర్ట్. దేశవ్యాప్తంగా చూస్తే తెలంగాణతో పాటు ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోనే  ఆయుష్మాన్ భారత్ పథకం అమలు కావడంలేదని దాఖలైన పిటిషన్ ను శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది. అనంతరం తెలంగాణ, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల సీఎస్ లకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్ట్.

ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తమ రాష్ట్రాలల్లో ఎందుకు అమలు చేయడంలేదో 2 వారాల్లోగా సమాధానం చెప్పాలని సీఎస్ లను ఆదేశించింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చలేదో కూడా వివరణ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్ట్.