ఫిబ్రవరి 10 నుంచి సూరారం కట్టమైసమ్మ జాతర

ఫిబ్రవరి 10 నుంచి సూరారం కట్టమైసమ్మ జాతర
  • ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ

జీడిమెట్ల, వెలుగు : సూరారంలోని కట్టమైసమ్మ జాతర ఇయ్యాల్టి నుంచి ప్రారంభం కానుంది. ప్రతి ఏటా జరిగే ఈ జాతరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. బొనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఈసారి జాతరలో భాగంగా శనివారం ఉదయం సుప్రభాత సేవ, గణపతి పూజ, మధ్యాహ్నం కల్యాణం

 ఒడి బియ్యం ఉంటాయని, సాయంత్ర అమ్మవారి ఊరేగింపు ఉంటుందని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ప్రధాన జాతర ఆదివారం జరగనుండగా..  సోమవారం రంగం, భవిష్యవాణి, ఫలహార బండి ఊరేగింపు ఉంటుందన్నారు.  బుధవారం జాతర ముగుస్తుందని వారు తెలిపారు.