
జీడిమెట్ల, వెలుగు : ఓ కేసులో సూరారం ఎస్ఐ నారాయణ సింగ్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. గత జనవరిలో సూరారం పీఎస్ పరిధిలో గుర్తు తెలియని మహిళ డెడ్ బాడీ దొరికింది. ఈ కేసులో సరిగా దర్యాప్తు చేయకుండానే ఎస్ఐ నారాయణ సింగ్మూసివేసే ప్రయత్నం చేసినట్లు క్రైం మీటింగ్లో ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో ఎస్ఐని మంగళవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.