
గుజరాత్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు అధికారులు. ఒకే రోజు ఐదు ప్రదేశాలలో ఏకకాలంలో దాడులు నిర్వహించి భారీ డ్రగ్ రాకెట్ గుట్టురట్టు చేశారు. ఈ డ్రగ్స్ రాకెట్ లో ఉన్నా 10 మందిని అరెస్టు చేశారు. ముంబైలోని గోవండిలో నివాసముంటున్న రబియా షేక్, సూరత్‌కు పెద్దఎత్తున ఎండి డ్రగ్స్‌ను తరలిస్తున్నట్లు సూరత్ క్రైమ్ బ్రాంచ్‌కు పక్కా సమాచారం అందడంతో ఆపరేషన్ నిర్వహించారు అధికారులు.
ఈ సమాచారంపై వేగంగా చర్య తీసుకున్న పోలీసులు, రబియా, అతని సహచరుడు షఫీక్ ఖాన్, పఠాన్‌ను ముంబై సూర్యనగరి రైలు నుండి దిగుతుండగా సూరత్ రైల్వే స్టేషన్‌లో పట్టుకున్నారు. అనంతరం జరిపిన సోదాల్లో 250 గ్రాముల ఎండి డ్రగ్స్‌ను స్కూల్ బ్యాగ్‌లో ఉందని గుర్తించి సీజ్ చేశారు. అనుమానితులను విచారించడంతో సూరత్‌లోని అదనపు డ్రగ్స్ వ్యాపారుల వద్దకు పోలీసులు చేరారు.
ఈ ఇంటెలిజెన్స్‌తో క్రైమ్ బ్రాంచ్ ఐదు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించేలా చేసింది. పాల్, రాండర్, తదితర ప్రాంతాల్లో చేపట్టిన దాడుల్లో 354.650 గ్రాముల MD డ్రగ్స్,1.930 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన 10 మందిలో గోవండికి చెందిన రబియా బాను, ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌కు చెందిన షఫీక్ ఖాన్ పఠాన్, భరూచ్‌కి చెందిన సర్ఫరాజ్ మరియు సల్మాన్, ఫైసల్ అల్లరఖా కచ్రా, యాసిన్ బాబుల్ ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి విచారణ చేపడతామని వెల్లడించారు.