
మాడ్రిడ్: ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్–4లో ఇండియా కాంపౌండ్ ఆర్చర్లు వెన్నం జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్ సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన విమెన్స్ క్వార్టర్ ఫైనల్లో ఆసియా గేమ్స్ చాంపియన్ జ్యోతి147–-144తో టర్కీ ఆర్చర్ హజల్ బురున్‌ను ఓడించింది. పర్ణీత్142-–141తో టర్కీకే చెందిన ఓజ్నూర్ క్యూర్ గిర్దిపై విజయం సాధించింది. సెమీస్‌లో ఈ ఇద్దరూ వేర్వేరు ప్రత్యర్థులతో తలపడతారు. మరోవైపు మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సెమీఫైనల్స్‌లో జ్యోతి సురేఖ-– రిషబ్ యాదవ్ జోడీ 152-–155తో నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయింది.
దీంతో ఈ జోడీ కాంస్య పతకం కోసం శనివారం ఎల్ సాల్వడార్ టీమ్‌తో తలపడనుంది. మెన్స్ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో టాప్ సీడ్ రిషబ్ యాదవ్ రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. అమన్ సైనీ, ప్రియాన్ష్ కూడా త్వరగానే నిష్క్రమించారు.రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ తొలి రౌండ్‌లో అంకితా భాకట్, ధీరజ్ ద్వయం 1-–5తో స్విట్జర్లాండ్ జంట చేతిలో ఓడిపోయింది.