ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్–4లో.. సురేఖ వరల్డ్ రికార్డు

ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్–4లో.. సురేఖ వరల్డ్ రికార్డు

మాడ్రిడ్: ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్–4లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఇండియా విమెన్స్ కాంపౌండ్ టీమ్‌‌‌‌ను ఫైనల్ చేర్చడంతో పాటు మిక్స్‌‌‌‌డ్ టీమ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో వరల్డ్ రికార్డు నెలకొల్పింది. సురేఖ, పర్ణీత్ కౌర్, పృథికతో కూడిన టాప్ సీడ్  అమ్మాయిల జట్టు బుధవారం (జులై 09) జరిగిన సెమీఫైనల్లో 230–-226 తేడాతో  ఇండోనేషియాను ఓడించింది.  

అయితే, రిషబ్ యాదవ్, ప్రథమేష్ ఫుగే, అమన్ సైనీతో కూడిన మెన్స్ టీమ్  క్వార్టర్ ఫైనల్లో 233–-234తో  మెక్సికో చేతిలో ఓడింది. కాంపౌండ్ మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌ క్వాలిఫికేషన్‌‌‌‌ రౌండ్‌‌‌‌లో జ్యోతి సురేఖ, రిషబ్ యాదవ్1431 పాయింట్లతో వరల్డ్ రికార్డు బ్రేక్ చేశారు.2023 యూరోపియన్ గేమ్స్‌‌‌‌లో డెన్మార్క్ నెలకొల్పిన 1429 పాయింట్ల రికార్డును అధిగమించారు. వ్యక్తిగత విభాగాల్లో రిషబ్ 716 పాయింట్లు,  సురేఖ 715 పాయింట్లతో తమ బెస్ట్ పెర్ఫామెన్స్‌‌‌‌ చేస్తూ టాప్ ప్లేస్‌‌‌‌ల్లో నిలిచారు.