అన్షు, వాసవి గణేశన్ జంటగా భిక్షు దర్శకత్వంలో వెంకట్ యాదవ్ నిర్మించిన చిత్రం ‘హుషార్ పిట్టలు’. ఏషియన్, సురేష్ ఫిలింస్ సంస్థలు ఆగస్టు 15న విడుదల చేసిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోందని టీమ్ తెలియజేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సురేష్ బాబు మాట్లాడుతూ ‘ఈ సినిమాని ఇప్పటివరకు లక్ష మంది చూశారు. దాదాపు కోటి ముప్పై లక్షల గ్రాస్ వచ్చింది. కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ సినిమాని చూస్తారు.
ప్రీమియర్ల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది’ అని చెప్పారు. బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘విడుదలైన అన్ని థియేటర్లు హౌస్ ఫుల్స్ అయ్యాయి. ఈ చిత్రంలో స్టార్స్ లేకపోయినా.. స్టార్ హీరో సినిమాకు వచ్చినంత రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే కొన్ని స్క్రీన్స్ పెంచాం’ అని చెప్పారు. ఈ సక్సెస్‌లో భాగమవడం చాలా ఆనందంగా ఉందని నటీనటులు అన్నారు. కంటెంట్ ఈజ్ కింగ్ అని మళ్లీ తమ చిత్రం నిరూపించిందని దర్శకుడు భిక్షు అన్నాడు. సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కు నిర్మాత వెంకట్ యాదవ్ థ్యాంక్స్ చెప్పారు. టీమ్ అంతా పాల్గొన్నారు.
