V6 News

అరెస్టైన కొద్ది సేపటికే బెయిల్ ‌పై విడుదలైన సురేశ్ రైనా

అరెస్టైన కొద్ది సేపటికే బెయిల్ ‌పై విడుదలైన సురేశ్ రైనా
ముంబై: క్రికెటర్ సురేశ్ రైనాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. కరోనా రూల్స్ కు విరుద్ధంగా తెరిచిన క్లబ్ పై ముంబై పోలీసులు దాడి చేయగా.. క్లబ్ లో ఉన్న సురేశ్ రైనాతో పాటు 34 మందిని అదుపులోకి తీసుకున్నారు.  ముంబై ఎయిర్ పోర్టుకు సమీపంలోని డ్రాగన్ ఫ్లై క్లబ్‌పై సోమవారం రాత్రి ఆకస్మిక దాడి చేశారు. వీరిలో ఏడుగురు క్లబ్ సిబ్బంది కూడా ఉన్నారు. నిర్ధారిత సమయం కంటే ఎక్కువ సేపు తెరిచి ఉండడంతో పాటు, కరోనా నిబంధనలు పాటించని క్రమంలో డ్రాగన్ ఫ్లై క్లబ్‌పై రైడ్ చేసి 34 మందిని అరెస్టు చేశామని తెలిపారు పోలీసులు. అరెస్టైన వారిలో క్రికెటర్ సురేశ్ రైనా, సింగర్ గురు రంధ్వానా కూడా ఉన్నారని, ఏడుగురు హోటల్ సిబ్బందిని కూడా అరెస్టు చేశామని చెప్పారు. వారిపై ఐపీసీ సెక్షన్ 188, 269, 34 ప్రకారం కేసు నమోదు చేశామని తెలిపారు.  అయితే అరెస్టైన కొద్ది సేపటికే సురేశ్ రైనా, గురు రంధ్వానాలు బెయిల్ ‌పై విడుదలయ్యారు.