ఆపరేషన్ రూమ్ నుంచే.. కోర్టు ట్రయల్‌‌‌‌కు హాజరైన డాక్టర్

ఆపరేషన్ రూమ్ నుంచే.. కోర్టు ట్రయల్‌‌‌‌కు హాజరైన డాక్టర్
  • అమెరికాలో డాక్టర్ నిర్వాకం.. మెడికల్ బోర్డు ఆగ్రహం

కాలిఫోర్నియా: అమెరికా కాలిఫోర్నియాలోని ఓ డాక్టర్ ఆపరేషన్ రూమ్ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ట్రయల్ కు హాజరయ్యారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేసిన కాలిఫోర్నియా మెడికల్ బోర్డు.. దీనిపై విచారణ చేపడతామని తెలిపింది. ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ స్కాట్ గ్రీన్ ఇటీవల ట్రాఫిక్ రూల్స్​ ఉల్లంఘించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ట్రయల్ జరిగింది. ఆ టైమ్​లో ఆపరేషన్ రూమ్​లో ఉన్న డాక్టర్ గ్రీన్.. అక్కడి నుంచే ట్రయల్​కు హాజరయ్యారు. ‘‘ఇది లైవ్ స్ట్రీమ్ అవుతోంది. మీరు ఆపరేషన్ రూమ్​లో ఉన్నట్టున్నారు” అని కోర్టు క్లర్క్ అడిగినప్పటికీ.. ‘పర్లేదు.. కానివ్వండి’ అని డాక్టర్ జవాబిచ్చారు. ప్రస్తుతం తాను ఆపరేషన్ చేయడంలేదని, వేరే డాక్టర్ ఉన్నారని జడ్జికి కూడా చెప్పారు. దీంతో జడ్జి ఆయనపై కోప్పడ్డారు. పేషెంట్ల ప్రాణాలంటే లెక్కలేదా? అని నిలదీశారు. తమకు ప్రజల ప్రాణాలే ముఖ్యమని, ట్రయల్​ను వాయిదా వేశారు. చివరికి డాక్టర్.. జడ్జికి క్షమాపణలు చెప్పారు.

ఇవి కూడా చదవండి

కరివేపాకే కదా అని తీసిపారేస్తున్నారా..?

జీఎస్టీ రిటర్నుల దాఖలు‌ గడువు పొడిగింపు

అగ్గువ వడ్డీకే హోమ్‌ లోన్స్‌

ఆరు నగరాల్లోనే ఐపీఎల్‌-14.. హైదరాబాద్‌కు దక్కని భాగ్యం