అరుదైన జబ్బులకు ఉస్మానియాలో సర్జరీలు

అరుదైన జబ్బులకు ఉస్మానియాలో సర్జరీలు
  • జెనిటిక్​ లివర్ ​డిజార్డర్, లివర్ ​ట్రాన్స్​ ప్లాంట్లేషన్​ ఆపరేషన్లు సక్సెస్​
  • ఇద్దరు పిల్లల ప్రాణాలను కాపాడిన డాక్టర్ల టీమ్

హైదరాబాద్, వెలుగు: అరుదైన జెనిటిక్ లివర్ డిజార్డర్​తో బాధపడే ఇద్దరు పిల్లలకు సర్జరీ చేసి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ డాక్టర్ల టీమ్ ప్రాణాలు కాపాడింది. ఖమ్మం జిల్లా ధనవారిపాలెంకు చెందిన విజయ్(14), సిద్ధార్థ్(16)లు  ప్రోగ్రెసివ్ ఫ్యామిలీ ఇంట్రాహెపాటిక్ కొలెస్టాసిస్ గా పిలిచే వ్యాధి బారినపడ్డారు. కొంత కాలంగా దురద, కామెర్లు, వారిలో ఎదుగుదల లోపించి అనారోగ్యానికి గురయ్యారు. కూలీ పని చేస్తేనే పూట గడిచే ఆ కుటుంబం ఎన్నో దవాఖానల్లో చూపించినా ప్రయోజనం దక్కలేదు. చివరి ప్రయత్నంగా ఉస్మానియాకు వచ్చారు. అక్కడ అడ్మిట్​ చేసుకుని కొంతకాలంగా ఆ ఇద్దరి ఆరోగ్య పరిస్థితిపై స్టడీ చేసిన సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ హెచ్​వోడీ ప్రొఫెసర్ డా. మధుసూదన్ నేతృత్వంలో డాక్టర్​ పాండు నాయక్, డాక్టర్ రమేశ్​కుమార్, డాక్టర్ ​జ్యోతి, డాక్టర్ ​సుదర్శన్, డాక్టర్ ​వేణు, డాక్టర్​వరుణ్ టీమ్ ​సర్జరీ చేసి ఇద్దరిని కాపాడారు. కరీంనగర్​కు చెందిన ఏడాది బాలుడికి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కూడా చేశారు. అరుదైన సర్జరీలకు పాలనపరమైన అనుమతులు ఇచ్చి సపోర్టు చేసినా సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్​ బి.త్రివేణి, ఆర్ఎంవో డాక్టర్ ​శేషాద్రిలకు కృతజ్ఞతలు తెలిపారు. నర్సింగ్, ఇతర మెడికల్ స్టాఫ్ సేవలను కొనియాడారు.