పాక్-చైనాల ప్రమేయం ఉందా?.. అయితే సర్జికల్ స్ట్రయిక్స్ చేయండి

పాక్-చైనాల ప్రమేయం ఉందా?.. అయితే సర్జికల్ స్ట్రయిక్స్ చేయండి

ముంబై: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు నిరసనలకు దిగుతున్నారు. రైతుల నిరసనలకు దాయాది పాకిస్తాన్, చైనా ఆజ్యం పోస్తున్నాయని కేంద్ర మంత్రి రావుసాహెబ్ దన్వే చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారుతున్నాయి. దీనిపై పలువురు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతలను జాతి వ్యతిరేకులుగా ముద్ర వేయడంపై ఢిల్లీ సిఖ్ బాడీ సీరియస్ అయ్యింది. తాజాగా దన్వే వ్యాఖ్యలపై శివ సేన ఎంపీ సంజయ్ రౌత్ ఫైర్ అయ్యారు. రైతుల నిరసనల్లో చైనా, పాక్‌‌ పాత్ర ఉన్నట్లయితే ఆయా దేశాలపై సర్జికల్ స్ట్రయిక్స్ చేయండి అంటూ రౌత్ సూచించారు.

‘రైతుల నిరసనల్లో చైనా, పాక్ హస్తం ఉందని సదరు మంత్రి (రావుసాహెబ్ దన్వే)కు సమాచారం ఉన్నట్లయితే.. డిఫెన్స్ మినిస్టర్ ఆ రెండు దేశాలపై సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించాలి. దేశ రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రితోపాటు ఆర్మ్‌‌డ్ ఫోర్సెస్ చీఫ్‌‌లు ఈ విషయం గురించి సీరియస్‌‌గా ఆలోచించాలి’ అని రౌత్ పేర్కొన్నారు.