Viswanath And Sons: ‘కరుప్పు’ సక్సెస్ జోష్‌లో సూర్య.. ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ రిలీజ్ డేట్ ఫిక్స్

Viswanath And Sons: ‘కరుప్పు’ సక్సెస్ జోష్‌లో సూర్య.. ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ వర్సటైల్ యాక్టర్ సూర్య ‘కరుప్పు’తో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ క్రమంలోనే సూర్య నుంచి రాబోతున్న తెలుగు డైరెక్ట్ ఫిల్మ్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘లక్కీ భాస్కర్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ప్యూర్ ఫ్యామిలీ & ఎమోషనల్ స్పోర్ట్స్ ఎంటర్‌టైనర్ అవ్వడంతో ప్రాజెక్ట్పై క్యూరియాసిటీ పెరిగింది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన రావడంతో, సూర్య నుంచి చాలా కాలం తర్వాత ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ రాబోతోందని అభిమానులు భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని పోస్టర్ రిలీజ్ చేశారు. సింపుల్ & కూల్ లుక్లో ఉన్న సూర్య పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సితార ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో సూర్యకి జోడిగా యంగ్ లేడీ హంట్ మమిత బైజు హీరోయిన్‌‌గా నటిస్తుంది. రాధిక శరత్‌‌కుమార్, రవీనా టాండన్  కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ప్రొఫెషనల్ షూటర్గా సూర్య..

ఈ చిత్రంలో సూర్య ‘సంజయ్ విశ్వనాథ్’ అనే 40 ఏళ్ల ప్రొఫెషనల్ షూటర్ పాత్రలో కనిపిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఒక పరిణతి చెందిన వ్యక్తిగా సూర్య తనదైన స్టైల్‌లో ఆకట్టుకొనున్నారు.

అయితే, ఇక్కడే ఒక ఆసక్తికరమైన మలుపు ఉంది. 20 ఏళ్ల మ్యాడీ పాత్రలో మమితా బైజు ఆయన జీవితంలోకి ప్రవేశించి, ఆయన్ని అమితంగా ప్రేమిస్తుంది. తన కంటే వయసులో చాలా చిన్నదైన ఆ అమ్మాయి ప్రేమను సంజయ్ నిరాకరిస్తూ ఉంటాడు. వీరి మధ్య ఉన్న 'ఏజ్ గ్యాప్' వల్ల వచ్చే సున్నితమైన భావోద్వేగాలను దర్శకుడు వెంకీ అట్లూరి చాలా అందంగా తెరకెక్కించినట్లు సమాచారం.

ALSO READ : మహేష్ ‘రుద్ర’ పాత్రకు దైవిక శక్తి.. 

‘ప్రేమలు’ఫేమ్ మమితా బైజు ఈ చిత్రంతో మరింత గుర్తింపు పొందేలా కనిపిస్తోంది. సూర్య వంటి దిగ్గజ నటుడి సరసన ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంది. వీరితో పాటు సీనియర్ నటీమణులు రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తుండటం సినిమాకు మరింత వెయిట్ ఇచ్చింది.

‘కరుప్పు’ బాక్సాఫీస్ హిట్..

‘కరుప్పు’ (తెలుగులో 'వీరభద్రుడు') బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కేవలం తమిళనాడులోనే రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తెలుగు వర్షన్ ('వీరభద్రుడు') ద్వారా సుమారు రూ. 30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాల టాక్. ఓవర్సీస్‌లో రూ.70 కోట్లు, కర్ణాటక-కేరళల్లో కలిపి మరో రూ.35 కోట్ల వరకు వసూలు చేసిందని సమాచారం. మొత్తానికి కరుప్పు వంటి భారీ సక్సెస్.. సూర్య ఫ్యాన్స్ కి బూస్ట్ ఇచ్చింది.