ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్.. సూర్య అభిమానులు మృతి

ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్.. సూర్య అభిమానులు మృతి

ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా యక్కాలవారి పాలెంలో విషాదం చోటుచేసుకుంది. జులై 23న తమిళ హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా బ్యానర్ కడుతూ.. ఆయన అభిమానులు ఇద్దరు కరెంట్ షాక్ తో చనిపోయారు. ఈ ఘటనలో మరో యువకుడికి తీవ్ర గాయాలుకాగా..  ఆ యువకుడిని స్థానిక హస్పిటల్ కు తరలించారు. 

ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతులు నక్కా వెంకటేష్, పోలూరిసాయిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం హస్పిటల్ కు తరలించారు.