వకీల్ సాబ్ కాదు.. ఈసారి అంతకుమించి! 'వీరభద్రుడు'గా సూర్య రుద్రతాండవం.. అదిరిపోయిన ట్రైలర్!

వకీల్ సాబ్ కాదు.. ఈసారి అంతకుమించి! 'వీరభద్రుడు'గా సూర్య రుద్రతాండవం.. అదిరిపోయిన ట్రైలర్!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya), త్రిష (Trisha) కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘కరుప్పు’. ఈ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ మే 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా సోమవారం విడుదల చేసిన ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

దుష్టశిక్షణే ధ్యేయం.. 

ట్రైలర్ చూస్తుంటే ఇదొక మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కినట్లు స్పష్టమవుతోంది. లాయరు ముసుగులో అమాయకులను ముంచేస్తూ, రౌడీయిజం చేసే బేబీ కృష్ణ (ఆర్జే బాలాజీ) అనే విలన్‌కు.. హీరో తన స్టైల్లో ఎలా బుద్ధి చెప్పాడనేదే ఈ సినిమా కథాంశం.  ఈ సినిమాలో సూర్య రెండు విభిన్న కోణాల్లో సాగే పాత్రలతో నట విశ్వరూపం ప్రదర్శించారు. ఒకవైపు సామాన్యుల కోసం కోర్టులో వాదించే పవర్‌ఫుల్ లాయర్‌గా, మరోవైపు దుష్టశిక్షణ చేసే వీరభద్రుడిగా యాక్షన్ సీక్వెన్స్‌లలో అదరగొట్టారు.

సోషల్ మెసేజ్‌తో పాటు ఈ చిత్రానికి ఒక ఇంట్రెస్టింగ్ డివోషనల్ టచ్ కూడా ఇచ్చినట్లు మేకర్స్ చెబుతున్నారు. సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్. ప్రభు నిర్మించిన ఈ చిత్రంలో ఇంద్రన్స్‌, నట్టి, స్వసిక, అనఘ, సుప్రీత్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు.

భారీ అంచనాలతో..

తెలుగు ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాను టాలీవుడ్ ప్రెస్టీజియస్ బ్యానర్ 'అన్నపూర్ణ స్టూడియోస్' ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తోంది. సూర్య-త్రిష కెమిస్ట్రీ, ఆర్జే బాలాజీ స్క్రీన్ ప్లే, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ కలగలిసిన ‘వీరభద్రుడు’ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మే 14న థియేటర్లలో సూర్య రుద్రతాండవం ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.